భారత్‌ ఘనవిజయం..

టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 రన్స్ చేసింది. ఒక దశలో మూడొందలకు పైగా సునాయాసంగా సాధిస్తుందనుకున్నా.. చివర్లో భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓపెనర్లు ఫించ్, వార్నర్ (42) తొలి వికెట్‌కు 70 పరుగులు, ఫించ్, స్మిత్ రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించి ఆసీస్‌కు మంచి స్టార్ట్ ఇచ్చారు. ఒక దశలో 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 రన్స్‌తో మూడొందలకు పైగా స్కోరు ఖాయంగా కనిపించింది. అయితే 224 పరుగుల దగ్గర ఫించ్ ఔటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 243 పరుగుల దగ్గర స్మిత్, మ్యాక్స్‌వెల్ (5) ఔటయ్యారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసే చాన్స్ మిస్ చేసుకుంది. ఇండియన్ బౌలర్లలో బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు