పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం ..!

ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు .స్థాపించడమే కాదు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి కారణం ఆయన .

ఆయనే పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .అంతా పాపులారిటీ ఉన్న ఆయనకు ఘోర అవమానం జరిగింది .అట్లాంటి ఇట్లాంటి అవమానం కాదు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన వర్గానికి చెందిన మీడియా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి ఎన్టీవీ చౌదరి ఏకైక కుమార్తె వివాహం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది .హైదరాబాద్ మహానగరంలో ఈ వివాహం చాలా ఘనంగా జరిగింది .

ఈ వివాహ వేడుకలకు అతిరథ మహులు హాజరయ్యారు .అందరి మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు .అయితే అదే సమయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడంతో భద్రత సిబ్బంది ఎవర్ని అటువైపుగా రానివ్వలేదు .దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు .అంతే కాకుండా ఏకంగా ఈ వివాహ వేడుకకి హాజరు కాకుండా వెనక్కి తిరిగి వెళ్ళాడు .అయితే ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఎంత సెలబ్రేటి అయిన సరే పక్కన ఉండాల్సిందే .అది ప్రోటోకాల్ .ఇది తెలియని పవన్ అక్కడి భద్రత సిబ్బంది పై విరుచుకుపడటం ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి .

సంబంధిత వార్తలు