ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయి

 చీరలను దగ్ధం చేసి ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలను మంత్రి నేడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించారన్నారు. చీరలను దగ్ధం చేసి ప్రతిపక్ష నేతలు ప్రజల ముందు అభాసుపాలయ్యారన్నారు. ఆడబిడ్డలు సంతోషంగా చీరలను తీసుకొని బతుకమ్మ సంబురాలు చేసుకుంటున్నరని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు