జూనియర్ ఎన్టీఆర్ కు జై కొట్టిన జక్కన్న ..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రీలీజ్ అయిన లేటెస్ట్ మూవీ జై లవకుశ .నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో రాశిఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా పని చేశాడు .ఉదయం విడుదల అయిన బెన్పిట్ షో దగ్గర నుండి మూవీ బ్లాక్ బ్లాస్టర్ అంటూ సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తోన్నారు .

వీరి జాబితాలోకి ప్రముఖ స్టార్ దర్శకుడు జక్కన్న చేరాడు . పలు ఇంటర్వ్యూ లలో నేటి యువతరంలో మీ అభిమాన నటుడు ఎవరు?’ జక్కన్నను అడిగితే ఆయన మరో ఆలోచన ఏమి లేకుండా చెప్పిన పేరు జూనియర్ ఎన్టీఆర్ .తాజాగా మరోసారి ఎన్టీఆర్‌ నటనకు జక్కన్న ఫిదా అయిపోయాఋ . ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘జై లవకుశ’ను చూసిన రాజమౌళి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘తారక్‌.. నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. మాటలు సరిపోవు. జై.. జై..’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు