తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్తులు జాతీయం ..

ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత  జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ ఆ రాష్ట్రంలో  మద్రాస్‌ హైకోర్టులో ఒక  ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.అందులో భాగంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని ఆ రాష్ట్రానికి  చెందిన ఒక  స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది.పోయిన ఏడాది  డిసెంబర్‌ 5న మృతిచెందిన జయలలితకు వారసులెవరూ లేని కారణంగా ఆమె ఆస్తులను జాతీయం చేయాలని, ఈ వ్యవహారం అంతా నిర్వహించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని దరఖాస్తుదారు ఈ సందర్భంగా హైకోర్టును కోరారు.సదరు దరఖాస్తుదారు  ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని ..దీనికోసం  జయ ఆస్తుల వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్‌ను కూడాపిటిషన్‌తో పాటు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ రేపు అనగా గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.

సంబంధిత వార్తలు