ఐనవోలు బ్రహ్మోత్సవాలకు రండి-సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రమేశ్ ఆహ్వానం ..

ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. ఈ మేరకు నిన్న (మంగళవారం )ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు