టీఆర్‌ఎస్ నేత కుటుంబానికి అండగా మంత్రి కేటీఆర్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఎన్నో సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తుంటారు తాజాగా నిన్న    తెలంగాణ ఉద్యమంలో జెండాపట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు ఆకస్మికంగా తనువుచాలిస్తే మంత్రి కేటీఆర్ ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొట్టెం బుచ్చయ్య 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ ఇటీవల మండల పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించింది. గత సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో బుచ్చయ్య గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ వార్తను పత్రికల్లో చూసిన జగన్‌రెడ్డి ఒంటర్పల్లి అనే తెలంగాణవాది మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి కేటీఆర్ తప్పకుండా న్యాయం చేస్తాం అని హామీఇచ్చారు. మంత్రి కేటీఆర్ స్పందనపై జగన్ సహా పలువురు తెలంగాణవాదులు హర్షం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు