" మంత్రి కేటీఆర్‌"ను అభినందించిన రాజ్‌దీప్ సర్దేశాయ్..

తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో జరిగిన ఇండియాటుడే దక్షిణాది రాష్ర్టాల కాంక్లేవ్‌లో ప్రసంగించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ను ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్‌సర్దేశాయ్ అభినందించారు.  ఐటీ, పరిశ్రమల వృద్ధి సవాళ్లు తదితర అంశాలపై మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని రాజ్‌దీప్ సర్దేశాయ్ తన ట్వీట్‌లో అభినందించారు.  కేటీఆర్‌ గారు, రాబోయే తరం రాజకీయవేత్తగా మీ స్ఫూర్తిదాయకమైన తీరును ఇలాగే కొనసాగించండి. నాయకుడంటే స్పష్టమైన దూరదృష్టి, శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి, మీరు దానికి ప్రతీక అని రాజ్‌దీప్ ట్వీట్ చేశారు.  దీనికి మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు