గ్రేటర్ హైదరాబాద్ కి ఎల్‌ఈడీ లైట్ల శోభ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4,60,000 సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే అతి పెద్ద ప్రక్రియ శరవేగంగా అమలవుతుంది .ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్‌ఈడీ బల్బుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరకు మొత్తం 2 లక్షలకు పైగా ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు.

ప్రస్తుతం అమర్చిన ఈ 2 లక్షల ఎల్‌ఈడీ బల్బుల వల్ల రోజుకు 7 వేల కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. మొత్తం 4,60,000 విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం వల్ల సంవత్సరానికి 20.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ. 14.72 కోట్ల పవర్ బిల్లు ఆదా కానుంది. దీంతో పాటు సంవత్సరానికి 16,587 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ తగ్గనుంది అని సమాచారం .

సంబంధిత వార్తలు