త్వరలోనే స్వీటీ కి పెళ్లి ..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి  మూవీలో నటించిన ప్రభాస్, అనుష్కల పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరు భారీ చర్చలే జరిపారు. కొందరు ప్రభాస్ – అనుష్క లు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారని ప్రచారం చేశారు . మరి కొందరు ఈ ఏడాది వీరిరివురు విడివిడిగా వివాహం చేసుకోనున్నారని అన్నారు. అయితే ప్రభాస్ పెళ్ళికి కాస్త టైం పడుతుందని తెలుస్తుంది .అయితే స్వీటీ  అనుష్క మాత్రం త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని ఫిలింనగర్ టాక్.

బాహుబలి చిత్రం తర్వాత జేజెమ్మ చేసిన భాగమతి చిత్ర షూటింగ్ రీసెంట్ గా పూర్తైంది. డిసెంబర్ లో ఈ మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. అయితే భాగమతి చిత్రం తర్వాత అనుష్క ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయకపోవడంతో అభిమానులలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ మధ్యలో వరుస పూజలు చేయడం, ఇటు తెలుగు, అటు తమిళంలో ను ఒక్క ప్రాజెక్ట్ ఒప్పుకోకపోవడంతో అనుష్క ఈ ఏడాది పక్కా గా పెళ్లి చేసుకుంటుందని జోస్యాలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు