మెట్రో ప్రారంభంలో జాప్యం...విమ‌ర్శ‌కుల‌కు మంత్రి కేటీఆర్ చెంప‌పెట్టు రిప్లై

మెట్రో రైల్ రూపంలో హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌యాణ‌ అనుభూతిని అందించేందుకు స‌ర్వం సిద్ధ‌మ‌యింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో ప్రారంభానికి అంతా ఓకే అయింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఓకే చేస్తే..త్వ‌ర‌లోనే ప్రారంభించుకోనున్న‌ట్లు  వివ‌రించారు. సికింద్రాబాద్‌లో మెట్రో ప‌నుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధానమంత్రిని స్వయంగా సీఎం కేసీఆర్ కలిసి ఆహ్వానించారని పేర్కొన్నారు. 

ఎన్నో ఒడిదొడుకులను మెట్రో రైల్ అధిగమించి ప్రారంభానికి సిద్ధ‌మ‌యింద‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. ``హైద‌రాబాద్‌ తర్వాత మెట్రో స్టార్ట్ చెసిన కొన్ని నగరల్లో ప్రారంభించారు అని....మెట్రో ఆలస్యమవుతుంది అని కొందరంటున్నారు. మేం వాళ్ల లాగ ఏడు, ఎనిమిది కిలోమీటర్లు ప్రారంభించాలనుకోలేదు. నగరం రెండు చివరలను కలపాలన్నదే మా ఉద్దేశం. అందుకే ఆలస్యం.`` అని విమ‌ర్శ‌కుల‌కు చెంప‌పెట్టు స‌మాధానం ఇచ్చారు. ప్రదాని నుంచి ఇంకా అనుమ‌తి రాలేదని పేర్కొంటూ...నవంబర్15 నుంచి  28 తేదీల్లో మెట్రో రైలు ప్రారంభం అవుతుందని అనుకుంటున్నామని తెలిపారు. ప్రారంభానికి తామెప్పుడైన రెడీయేన‌ని పేర్కొంటూ ప్రధాన‌మంత్రి టైం కోసమే ఆగామని తెలిపారు. 

సికింద్రాబాద్‌ ఓలిఫెంటా బ్రిడ్జ్ నిర్మాణం అత్యద్భుతమ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. ``మియాపూర్ డిపో లో ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాము. ప్రతి మెట్రో స్టేషన్ కు నాలుగు ఫుట్ ఓవర్ బ్రిడ్జలు ఉన్నాయి. స్కై వాక్ లను నిర్మిస్తాము. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ నుండి మెట్రో రైల్ స్టేషన్ కు స్కై వాక్ నిర్మిస్తున్నాము. 40%‌ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రారభించిన మెట్రో ఏది లేదు, మనమే చేస్తున్నం``అని తెలిపారు. మెట్రో స్టేషన్ లో ఎలక్ట్రికల్ వెహికల్ ను ఉపయోగించనున్నామని మంత్రి ప్ర‌క‌టించారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రోకు ఒకే విదమైన ప్ర‌యాణ‌ కార్డ్ ఉండేలా చూస్తామని ప్ర‌క‌టించారు. మెట్రో రైల్ ఆప్ ను కూడా తీసుకురాబోతున్నామని మంత్రి ప్ర‌క‌టించారు. భద్రత విషయంలో అన్ని ప్రమాణాలు పాటించామని తెలిపారు. మిగతా ప్రాజెక్టును వచ్చే సంవత్స‌రం పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు