రేపిస్ట్ రేప్ ఎలా చేశాడు ..?విద్యార్దినితో ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం ..

బిహార్‌ రాష్ట్రంలోని చినారి నియోజకవర్గానికి చెందిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ ఎమ్మెల్యే మంచి చిక్కుల్లో పడ్డారు.ఒక విద్యార్థిని అనుమానాస్పద మృతి గురించి విద్యార్థినులతో మాట్లాడుతూ ఆయన అడిగిన పలు ప్రశ్నలు విమర్శలకు దారి తీస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో దళిత విద్యార్థినుల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమెపై అత్యాచారం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కూడా . అయితే ఈ విషయమై విద్యార్థినులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే లాలన్‌ పాసవాన్‌ నిన్న మంగళవారం వసతి గృహానికి వచ్చారు.అయితే ఈ సంఘటనపై విద్యార్థినులను అడగకూడని ప్రశ్నలు అడిగారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఒక విద్యార్థిని ఇబ్బందిగా సమాధానాలు చెప్తున్న వీడియో ప్రసార మాధ్యమాల్లో రావటంతో ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే ‘జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పు. నువ్వు వివరంగా చెప్పకపోతే ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది? మీరు చదువుకున్న అమ్మాయిలు. సరిగ్గా చెప్పాలి.. ఒకవేళ ఆ సంఘటన రేపు నీకే జరిగితే? రేపిస్ట్‌ నీ గదికే వస్తే.. ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తావు..’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా బిత్తరపోయిన బాలికలు తెల్లమొహం వేశారు.అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ‘ విద్యార్థినులకు సాయం చేసే ఉద్దేశంతో నేను అలా మాట్లాడాను. ఆ సంఘటన ఎలా జరిగిందనే దానిపై నేను ప్రశ్నలు వేశాను. మీడియా దానిని అనవసరంగా రా ద్ధాంతం చేస్తోంది. నేను అడిగిన విధానం తప్పై ఉండవచ్చు కానీ నా ఉద్దేశం మాత్రం తప్పు కాదు’ అని ఆయన సమర్థించుకున్నారు.

సంబంధిత వార్తలు