సూపర్‌ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయండి... ఎంపీ వినోద్‌

రెండో కౌన్సెలింగ్‌ తరువాత కూడా దేశవ్యాప్తంగా మిగిలిపోయిన సుమారు 500 సూపర్‌ స్పెషాలిటీ సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. వైద్యకోర్సుల్లో సీట్లు మిగిలిపోవడం మంచి పరిణామం కాదన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 48 సీట్లు కలుపుకొని దేశవ్యాప్తంగా మిగిలిన సుమారు 500 సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్‌ గడువును అక్టోబర్‌ 7వ తేదీవరకు పొడిగించాలని లేఖలో కోరారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో దేశ ప్రజల ఆరోగ్య సేవలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు