లోకేశ్ అంత చిన్నపిల్లాడేతే బొమ్మలతో ఆడుకోవాలి కానీ తండ్రి ట్విట్టర్ అకౌంట్ తో కాదు..

తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ఓ అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. లోకేశ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది..  తాజాగా నందమూరి బాలయ్య నటించిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి.. ఈ సినిమాలో బాలయ్య మావయ్య నటన అబ్బురపరచిందని, మిగతా ఆర్టిస్టులు కూడా ఎంతో బాగా నటించారని, వారందరికీ విషెస్ చెప్తూ నారా లోకేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే అదే ట్వీట్ని ఒక్క అక్షరం కూడా మార్చకుండా సీఎం చంద్రబాబు ట్విట్టర్ లోకి పేస్ట్ చేసేసారు. అయితే లోకేశ్ కి మావయ్య అయిన చంద్రబాబుకు వియ్యంకుడు అవుతాడు కదా మరి అది మాత్రం మార్చలేదు. మరి ఈ ట్విట్టర్ పోస్ట్ లోకేశ్ చేశారా.? లేక చంద్రబాబు చేశారా.? అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు హల్ చల్ చేస్తోంది. సీఎం పదవి అంటే చంద్రబాబు, లోకేశ్ ల ఇంటి వ్యవహారం కాదని, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన ఓ బాధ్యత అని అటువంటి వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ మెయిన్ టెన్ చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలంటూ నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. లోకేశ్ అంత చిన్నపిల్లాడేతే బొమ్మలతో ఆడుకోవాలి కానీ తండ్రి ట్విట్టర్ అకౌంట్లతో ఆడుకోవడమేమిటని ప్రశ్నిస్తూ సెటైర్లు పేలుస్తున్నారు.

సంబంధిత వార్తలు