వన్డేలు, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని..

క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని 2017 ఆరంభంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.వన్డేలు,టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.అయితే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే,టి20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.ప్రస్తుతం టెస్ట్‌మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్‌కోహ్లికే వన్డేలు, టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఎల్లుండి జరిగే బీసీసీఐ సమావేశంలో భారత్‌ కెప్టెన్‌గా కోహ్లి పేరును ఖరారు చేయనున్నారు.

* 2007 సెప్టెంబరు నుంచి టీ20 మ్యాచ్‌లకు ధోని సారథ్యం వహించాడు.

* 2007 సెస్టెంబరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ నుంచి వన్డేలకు ధోని బాధ్యతలు చేపట్టాడు.

*జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన మహేంద్రసింగ్‌ ధోని 72 టీ20 మ్యాచ్‌లకు, 199 వన్డేలకు సారథ్య బాధ్యతలు వహించాడు.

* ధోని సారథ్యంలో 2009 డిసెంబరులో టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌ వన్‌గా అవతరించింది.

* ధోని కెప్టెన్సీలో భారత్‌ జట్టు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచ కప్‌ సాధించింది.

* 2013 మార్చిలో విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా భారత్‌ తరఫున ధోనీ రికార్డు నమోదు చేశాడు. * 49 టెస్టుల్లో 21 విజయాలు సాధించిన గంగులీ రికార్డును ధోని అధిగమించాడు.

* ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా ధోనిని ప్రముఖ క్రికెటర్లు కొనియాడారు.

సంబంధిత వార్తలు