'నమో వేంకటేశాయ'కు బంజారా సామాజికవర్గ ప్రజల సెగ ..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు నాగార్జునల కాంబినేషన్ లో తెరకెక్కిన భక్తి చిత్రం 'నమో వేంకటేశాయ'కు బంజారా సామాజికవర్గ ప్రజల సెగ తగిలింది. ఈ సినిమాను హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా తీసినప్పుడు ఆయన పేరు పెట్టకుండా.. భగవంతుడి పేరు ఎలా పెడతారని బంజారాలు ప్రశ్నిస్తున్నారు. రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాలకు వారి పేర్లనే పెట్టారని... ఈ సినిమాను మాత్రం భగవంతుడి పేరుతో తెరకెక్కించడం ఏమిటని బంజారా నేతలు ప్రశ్నిస్తున్నారు. చిత్రం పేరును హథీరాంబాబాగా మార్చాలని, లేకుంటే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. అయోధ్యలో జన్మించిన హథీరాం, వెంకటేశ్వరస్వామి కోసం తిరుమల వెళ్లి అక్కడ అడవిలోని ఓ ఆశ్రమంలో నివసించారట. ఈ క్రమంలోనే బంజారా సామాజికవర్గ ప్రజలకు ఆయన దగ్గరయ్యారు.

సంబంధిత వార్తలు