జనం మెచ్చిన ప్రజానాయకుడు వై.యస్.జగన్ ..ఎనిమదేళ్ల రాజకీయ ప్రస్థానం..!

 

 జనం కోసం జగన్..జగన్ కోసం జనం..నిజంగా జనం కోసం పరితపించే  ప్రజా నాయకుడు సమకాలీన రాజకీయ నాయకుల్లో వైయస్ జగన్ ఒక్కడే అని అందరూ ఒప్పుకోవాల్సిన విషయం..రాజకీయాల్లో జయాపజయాలు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే జగన్ ని అందరు రాజకీయ నాయకుల కంటే ప్రత్యేకత తెచ్చిపెట్టింది..ఒక్కసారి జగన్ సభలకు వెళితే తెలుస్తుంది..ముఖ్యంగా పేదల కండ్లలో జగన్ని చూడగానే ఆనందం కనిపిస్తుంది..ప్రతి అవ్వా, అమ్మా మన రాజన్న బిడ్డ తన ఇంటికి వచ్చాడని సంబురపడుతుంది..ప్రతి అక్కా చెల్లెమ్మ తన తోడబుట్టిన వాడే తనను పలకరించడానికి వచ్చాడని మురిసిపోతుంది..ప్రతి అన్నా, తమ్ముడు తన తోడ బుట్టినవాడే తనను తోడుగా నిలబడడానికి వచ్చాడని భరోసాగా ఫీలవుతాడు..దీనికి కారణం జగన్ అంటే ఓ నమ్మకం, ఓ విశ్వసనీయత,  ధైర్యం, ఓ అండ...ఓ భరోసా..జగన్ మా మనిషి..మా కుటుంబంలోని వ్యక్తి అని తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ భావించడమే..తండ్రి  వైయస్ లాగానే జగన్ కు ఎలాంటి భేషజాలు చూపడు. పేదలంటే ఎంతో ప్రేమ. జగన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అని, పెద్ద పొగరుబోతు అని, పెద్దల పట్ల మర్యాద చూపడు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు..కానీ జగన్ని జనంలోంచి చూస్తే మాత్రం ఓ ఇంటి కొడుకు, ఓ బాధ్యత గల సోదరుడులా కనిపిస్తాడు..అంతలా పేద ప్రజలతో మమేకం అవుతాడు..రాజ అంతఃపురం ల్లాంటి విలాసవంతమైన ప్యాలెస్ లలో సౌకర్యంగా జీవితం గడిపే జగన్ పేదల గుడిసెల్లో కూడా అంతే సౌకర్యంగా ఫీలవుతాడు.. బంగారు పళ్లెంలా కోరుకున్న తిండి తినగలిగే జగన్ పేదల గుడిసెల్లో వారు పెట్టే పచ్చడి మెతుకులు కూడా అంతే ఆప్యాయంగా తింటాడు..అందుకే జగన్ జనం కోసం పుట్టాడు అంటారు..ఎన్టీఆర్, వైయస్ ఆర్, కేసీఆర్ ల తర్వాత పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నిజమైన ప్రజానాయకుడు జగన్ మాత్రమే..

 

రాజకీయ అరంగేట్రం..!
  జగన్ భారత రాజకీయాల్లోనే ఓ సరి కొత్త సంచలనం..పేదల పెన్నిధి, మహోన్నత నాయకుడు వైయస్సార్  వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు . .2004లో తొమ్మిదేళ్ల టీడీపీ పాలనకు చరమగీతం పాడడంలో వైయస్ పాదయాత్ర ఎంత కీలక పాత్ర వహించిందో మనందరికీ తెలుసు..అదే సమయంలో వైయస్ జగన్ రాష్ట్రమంతటా తిరిగి కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు..ఆ తర్వాత 2009 ఎన్నికల్లో వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాల గురించి ప్రచారం చేస్తూ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించాడు..తండ్రి వైయస్ లాగానే పేద ప్రజల్లోకి చొచ్చుకుని పోవడం, హావభావాలు అచ్చం తండ్రిలాగానే పోలి ఉండడం చూసి ప్రజలు జగన్ని మన వైయస్ బిడ్డ అని చెప్పుకుని మురిసిపోయారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,వైయస్ ఆర్ అభిమానుల కోరిక మేరకు జగన్ 2009లో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి అఖండ విజయం సాధించాడు..ఆ తర్వాత కొద్ది కాలంలోనే వైయస్ హఠాన్మరణంతో  జగన్ రాజకీయ జీవితం మలుపు తిరిగింది..వైయస్ విధేయులైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ని సీఎం చేయాలని సంతకాలు పెట్టి అధిష్టానంకు వినతి పత్రం అందించారు..కానీ అధిష్టానం మాత్రం జగన్ కు అనుభవం లేదని భావించి సీనియర్ అయిన రోశయ్యకు అధికారం కట్టబెట్టింది..అయినా జగన్ చలించలేదు..అధికారం కన్నా ప్రజలే ముఖ్యం అనుకున్నాడు..

ఓదార్పు యాత్ర తో ప్రజలతో మమేకం..!
 

   దివంగత ముఖ్యమంత్రి వైయస్ మరణాన్ని తట్టుకోలేక నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 600 గుండలు ఆగిపోయాయి..వారి కుటుంబాలన్నీ తమ ఆప్తులను కోల్పోయి దిక్కు తోచని పరిస్థితిలో పడ్డాయి..పేదలే తన కుటుంబంగా భావించే జగన్ ఓ పెద్ద కొడుకుగా  ఆయా కుటుంబాల వారిని ఓదార్చాల్సిన బాధ్యత తనకుందని భావించాడు..అందుకే వైయస్ మరణించిన పావురాల గుట్టలో సంతాప సభ వేదిక సాక్షిగా రాష్ట్రమంతా తిరిగి తన తండ్రి మరణంతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి వారికి అండగా నిలబడతానని ప్రకటించాడు..అప్పటికే జనంలో జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ అధిష్టానం ఈ యాత్రను మరో విధంగా అర్థం చేసుకుంది..ఓదార్సు యాత్ర చేయద్దు..జిల్లా కేంద్రాలకు వారిని తీసుకువచ్చి ఆర్థిక సహాయం అందించమని సూచించింది.కానీ జగన్ మాత్రం  మాట తప్పడం, మడమ తిప్పడం మా వంశంలోనే లేదు..తన తండ్రి మరణంతో పెద్ద దిక్కులను కోల్పోయిన కుటుంబాల వారిని స్వయంగా ఓదార్చి ,అండగా నిలబడతానని చెప్పాడు..ఇక్కడే కాంగ్రెస్ అధిష్టానానికి, జగన్ కు మధ్య విభేదాలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతారు..కాంగ్రెస్ అధిష్టానాన్ని  కాదని జగన్ రాష్ట్రమంతటా ఓదార్పు యాత్ర చేపట్టి ఊరూరా తిరుగుతూ ఆయా కుటుంబాల వారి ఇంటికి వెళ్లి వారికి మనో ధైర్యాన్ని కల్పించి ,తగిన ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలబడ్డాడు..ఓదార్పు యాత్రతో దాదాపు రెండున్నరేళ్లకు పైగా దాదాపు 70,000 కి.మీలు తిరుగుతూ జనంతో పూర్తిగా మమేకం అయ్యాడు  జగన్..ఇక్కడే ప్రజలు వైయస్ బిడ్డ జగన్ కు, ఇతర రాజకీయ నాయకులకు మధ్య తేడా ఏంటో అర్థం చేసుకోగలిగారు..ఓదార్పు యాత్రతో  జగన్ కు ప్రజల్లో మైలేజీ పెరగడంతో నాటి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష టీడీపీ పార్టీలు కూడా ఉలిక్కిపడ్డాయి..జగన్ని కట్టడి చేసేందుకు అనేక వ్యూహాలు పన్నడం ఆరంభించాయి..దీంతో విసుగెత్తిన జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  చేసి తండ్రి పేరుతో 2011లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు..ఇక్కడే వైయస్ జగన్ రాజకీయ జీవితం కీలక మలుపు తీసుకుంది..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ప్రస్థానం:
 

 2010లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశాడు.  ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల కుట్రలను చేధిస్తూ  ప్రజల మద్దతుతో అఖండ మెజారిటీతో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత  వైయస్ కు నమ్మిన బంటుల్లా ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ కు మద్దతు ఇచ్చారు.ఇక్కడే ఇతర రాజకీయ నాయకులకు, జగన్ కు తేడా ఏంటో దేశానికి అర్థమయింది..విలువలతో కూడిన రాజకీయాలకు జగన్ ఎంతగా కట్టుబడ్డాడో ప్రపంచానికి తెలిసింది..తన వెంట వచ్చిన 16 మంది ఎమ్మేల్యేలను  రాజీనామా చేయించి, వారిని తిరిగి ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపునఅఖండ మెజారిటీతో గెలిపించిన ధీరుడు వైయస్ జగన్..తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన జగన్ మనో ధైర్యాన్ని చూసి ప్రజలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నాయకుల కంటే జగన్ ఎంతో మెరుగు అని భావించారు.ఎన్టీఆర్ తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన ధీరోదాత్తుడు వైయస్ జగన్ అని ప్రజలు ముక్త కంఠంతో ప్రశంసించారు..

జగన్ పై ప్రత్యర్థి పార్టీల కుట్రలు - అక్రమాస్థుల కేసులు..!
 

    రోజు రోజుకీ ప్రజల్లో జగన్ కు ఆదరణ పెరిగిపోతుండడంతో నాటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టింది..జగన్ కు చెక్ పెట్టాలని కుట్రలు చేసినట్లు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.ఆ కుట్రల ఫలితమే జగన్ పై అక్రమాస్తుల కేసులు.. సిబీఐని ప్రయోగించి  దాదాపు లక్ష కోట్లు అక్రమంగా కూడగట్టాడంటూ జగన్ పై కేసులు బనాయించాయి నాటి ప్రభుత్వాలు..కానీ జగన్ భయపడలేదు..ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.ఆఖరికి కేసుల పేరుతో నేరం రుజువు కాకపోయినా సాక్ష్యాలు తారుమారు చేస్తాడంటూ జగన్ని దాదాపు రెండేళ్ల పాటు జైల్లో బందీని చేసింది నాటి ప్రభుత్వం..జగన్ ఆస్తులను జప్తు చేసి ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు..జైలు పాలు చేసినా వైయస్ జగన్ కుంగిపోలేదు.. వెనకడుగు వేసేవాడు నాయకుడు కాడు..ఆ రెండేళ్లు తన తల్లి, సోదరి అండతో పార్టీని ప్రజలతో మమేకం అయ్యేలా చేశాడు..జగన్ చేసిన ఓదార్పు యాత్రలను షర్మిల కొనసాగించింది..దాదాపు రెండేళ్లు జైలులో పెట్టినా సిబిఐ జగన్ పై పెట్టిన కేసులను నిరూపించలేకపోయింది..దీంతో జగన్ని కోర్టు బెయిల్ పై విడుదల చేసింది..ఈ లోగా తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఉమ్మడి రాష్ట్రం విభజన దిశగా అడుగులు పడుతున్నాయి..ఇక్కడ కూడా అందరి రాజకీయ నాయకుల్లాగా రెండు కళ్ల సిద్ధాంతం పాటించలేదు..తెలుగు ప్రజలందరూ ఐక్యంగా కలిసి ఉండాలనే భావనతో వైయస్ జగన్ సమైక్యాంధ్రకు జై కొట్టాడు..కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చెప్పాడు..మరో పక్క ఉమ్మడి రాష్ట్రంలో అయితే జగన్ క్రేజ్ ముందు గెలవలేను అనుకున్న టీడీపీ పార్టీ కూడా రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించింది..దీంతో కేంద్రం 2014లో రాష్ట్ర విభజన చేసింది..

వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడిగా తిరుగులేని నాయకత్వం..!
 

            నిండా 40 ఏళ్లు కూడా లేవు..దూకుడు స్వభావం, మొండి వాడు, ఎవరి మాట వినడు..రాజకీయ అనుభవం లేదు పార్టీని ఎలా నడుపుతాడు అని రాజకీయ పండితులు జగన్ని తక్కువగా అంచనా వేశారు..కానీ జగన్ కు ఆ మొండితనం, దూకుడు స్వభావమే ప్లస్ పాయింట్ అయింది..పార్టీ పెట్టిన మూడేళ్లలోనే పార్టీని పటిష్టంగా నిలబెట్టడంలో వైయస్ జగన్ తనలో సమర్థుడైన నాయకుడు ఉన్నాడని చాటి చెప్పాడు..వైయస్ నుంచి సంక్రమించిన  ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అసాధారణ రీతిలో తన నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ను నిజమైన ప్రజాపక్షంగా నిలబెట్టాడు..దీంతో 2014లో జగనే అధికారంలోకి వస్తాడని మీడియా సంస్థలతో పాటు, అన్ని రాజకీయ పార్టీలు భావించాయి..కానీ ఏపీ ప్రజలు రాష్ట్రం విడిపోయిన క్లిష్ట పరిస్థితిలో చంద్రబాబు లాంటి అనుభజ్ఞుడైన నాయకుడు ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకుంటుందని భావించారు..అంతే కాదు ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో జిత్తులు పన్నాడు..అమలు సాధ్యం కానీ రుణమాఫీ హామీతో పాటు 600 రకాల హామీలు ఇచ్చాడు..కానీ జగన్ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ అమలు చేయడం కష్టం అన్నాడు..పార్టీ శ్రేణులు ఎంతగా వత్తిడి తెచ్చినా జగన్ వినలేదు..ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను మోసం చేసే హామీలు ఇవ్వను అని నిక్కచ్చిగా ప్రకటించాడు..సమకాలీన రాజకీయాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కే నాయకులున్న కాలంలో నిజాయితీ, నిక్కచ్చిగా ఎన్నికల్లొ నిలబడ్డ నికార్సైన రాజకీయ నాయకుడు జగన్ మాత్రమే..దీనికి తోడు చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి మోదీని, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకున్నాడు..దేశంలో మోదీ వేవ్, పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్ తో ఓ వర్గం ఓట్లు గంపగుత్తుగా టీడీపీకి పడ్డాయి..దీంతో జగన్ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాడు..కానీ పార్టీ పెట్టిన మూడేళ్లలోనే 65 ఎమ్మెల్యేలు స్థానాలు గెల్చి దేశంలోనే బలమైన ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్ సరికొత్త సంచలనం సృష్టించాడు..

ప్రతిపక్షనాయకుడిగా నిరంతరం ప్రజల పక్షం...!

        
         సాధారణంగా కోరుకున్న అధికారం దక్కకపోతే ఏ పార్టీ అయినా కొన్నాళ్లపాటు స్థబ్దుగా ఉండిపోతుంది..ఆ పార్టీల నాయకులు  రాజకీయంగా కనుమరుగు అవుతారు..లేకుంటే తన పార్టీని వేరే పార్టీలో కలిపేస్తాడు..ఈ విషయంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో రుజువు అయింది.. కానీ జగన్ జయాపజయాలకు అతీతం..కేవలం 5 లక్షల ఓట్లే తేడాతో అధికారాన్ని కోల్పోయినా జగన్ నిరాశ చెందలేదు..జగన్ కు పాజిటివ్ ఆటిట్యూడ్ ఎక్కువ..ప్రజలు తనకు బలమైన ప్రతిపక్ష నాయకుడిగా సేవ చేసేందుకు కీలక బాధ్యతలు అప్పగంచారని భావించాడు..అందుకే గత రెండున్నరేళ్లుగా ప్రజా క్షేత్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నిర్మాణాత్మక బాధ్యత వహిస్తున్నాడు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు..అమరావతిలో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్న టీడీపీ ఫ్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు..రైతు రుణమాఫీపై చంద్రబాబు మోసాన్ని నిలదీశాడు ..రైతు దీక్షలతో రైతన్నలకు అండగా నిలబడుతున్నాడు..ప్రజల సమస్యలపై అనుక్షణం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, టీడీపీ నాయకుల అవినీతిని ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఏపీలో టీడీపీ పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక ఏపీకి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదాపై మాట మార్చిన బిజేపీ, టీడీపీలపై ప్రజల తరపున అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు.. యువభేరీలతో ప్రజలను, యువకులను జాగృతం చేస్తూ అధికార టీడీపీ నాయకుల గుండెల్లో  రైళ్లు  పరిగెత్తిస్తు న్నాడు. ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను సాధించే సత్తా కేవలం వైయస్ జగన్ కే ఉందని ఇప్పుడు ఐదున్నర కోట్ల ఆంధ్రులు నమ్ముతున్నారంటే అతిశయోక్తి కాదు..

2019లో సరికొత్త జగన్ శకం ఆరంభం..!
 

   ఈ రెండున్నరేళ్లలో జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బెంబేలెత్తిన అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి ధన బలంతో, 20 మంది వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంది..అయినా జగన్ చలించలేదు.. నాయకులు పోయానా కార్యకర్తలు , ప్రజలు మాత్రం జగన్ వెంటే నిలబడ్డారు..ఓ పక్క తనపై అక్రమంగా పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూనే మరో పక్క ఏపీ ప్రజలకు అన్ని విధాల అండగా నిలబడుతున్నాడు..వారి సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్నాడు..చంద్రబాబు ఆయన పార్టీ నాయకుల అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేస్తున్నాడు..ఇప్పడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతున్న తరుణంలో ప్రజల ముందు నిలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే..జగన్ లో సమర్థుడైన పాలకుడు ఉన్నాడని ఇప్పటికే దేశంలోనే ప్రసిద్ధి చెందిన తెహెల్కా.కామ్ ప్రకటించింది..ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి..2019లో జగన్ సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..ఇప్పడు ఏపీ ప్రజలకు జగన్ అంటే ఓ  నమ్మకం, ఓ విశ్వసనీయత , ఓఅండ, ఓ ధైర్యం, ఓ ఆత్మవిశ్వాసం, ఓ నిజాయితీ గల నాయకుడు, .సమకాలీన రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు నెరుపుతున్న ఓ నికార్సైన యువ నాయకుడు..జగన్ వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు..అవును.. జనం కోసం జగన్..జగన్ కోసం జనం.మరో రెండున్నరేళ్లలో ఏపీ రాజకీయాల్లో సరికొత్త జగన్ శకం ఆరంభం కావడం ఖాయం..ఈ రోజు జనం మెచ్చిన నిజమైన ప్రజానాయకుడు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది మా దరువు.కామ్.

సంబంధిత వార్తలు