రేపు విడుద‌లౌవుతున్న బాల‌య్య సినిమాపై చిరు కామెంట్స్..

‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన‌ విష‌యంపై మెగాస్టార్ చిరు మాట్ల‌డుతూ ‘గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే. అయితే ‘రుద్రమదేవి’కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేది. రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే. గుణశేఖర్‌గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా. దానికి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించింది కానీ, ఏపీలో లభించలేదు. ఆ సినిమాకిచ్చి, ఈ సినిమాకీ ఇచ్చుంటే.. ‘ఓహో.. ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయ’ని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి మాత్రం ఇవ్వడం విమర్శకు తావిస్తోంది’’.

సంబంధిత వార్తలు