ఇచ్చాపురం నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి ..?2019లో గెలుస్తాడా ..?

ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో కంచుకోటగా ముద్రపడిన మరో నియోజక వర్గం ఇచ్చాపురం .ఈ నియోజక వర్గం 1978 లో ఏర్పాటైన తర్వాత అప్పటి నుండి 2014 వరకు మొత్తం తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు జరగగా ఇందులో ఆరు సార్లు టీడీపీ తరపున పోటి చేసిన అభ్యర్ధులే గెలిచారు .నియోజక వర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ఓటర్లున్నారు .ఈ నియోజక వర్గంలో 1983 నుండి 2014 వరకు 2004 లో మినహా అన్ని సార్లు టీడీపీ అభ్యర్ధి గెలుపొందారు .అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటిచేసిన బెందాళం అశోక్ 86,815 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్ధి ఎన్ రామారావు (61 ,537 )పై దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు .ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరెండ్లు అయిన కానీ నియోజక వర్గంలో సరిహద్దు ప్రాంతాలు ,గ్రామాలు కూడా ఎమ్మెల్యే కి తెలియకపోవడం ఆశ్చర్యకరం .

గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణమైన బెంత్ ,ఒరియా ,క్షత్రియ ,అగ్నికుల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చకపోవడంతో చాలా కసిగా ఉన్నారు .జనాభా పరంగా అధికంగా ఉన్న రెడ్డీక/కొంపర(28088 ఓట్లు),యాదవ/గొల్ల(19235ఓట్లు),బెస్త/పల్లి/గండ్ల(15583ఓట్లు ),కాళింగ(14938ఓట్లు )    సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు .గత ఎన్నికల్లో గెలిపిస్తే సోంపేట విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణాన్ని ఆపేస్తా అని హమీచ్చిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాన్ని ఆపి పలు కంపెనీల నిర్మాణం వైపు తలోగ్గుతున్నారు .ఉద్దానం కిడ్ని భాదితులను ఆడుకుంటా అని ,కొబ్బరి పంటను పండించే రైతులకు అండగా ఉంటాను అని హమిచ్చిన అశోక్ వాటిని గాలికి వదిలేశారు .

బెంత్ ఒరియాలకు రిజర్వేషన్లు కల్పిస్తాను అని ..ఇచ్చాపురం మున్సిపల్ కార్పోరేషన్ లో వాటర్ సమస్యను తీరుస్తా అని హామీ ఇచ్చిన అశోక్ వాటిని కూడా గాలికి వదిలేశాడు .దీంతో స్థానిక నియోజక వర్గ ప్రజలు అశోక్ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు .నియోజక వర్గం వ్యాప్తంగా ముఖ్యంగా ఉద్దానం చోట వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చి అధికారం ఉన్న కానీ ఇచ్చిన ఒక్క హామీ ను కూడా నేరవేర్చకపోవడంతో ఎమ్మెల్యే మీద స్థానిక ఓటర్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు .ఎస్టీ రిజర్వేషన్ల మీద పోరాడుతున్న ఆ సామాజిక వర్గానికి అండగా నిలబడకపోవడంతో ఆ వర్గం ప్రజలు కూడా దూరమయ్యారు .
ప్లస్ లు ..
*ఇచ్చాపురం ఎమ్మెల్యే కి ప్లస్ లు కంటే మైనసులే ఎక్కువగా ఉన్నాయి .
మైనస్ లు 
*మున్సిపల్ ఛైర్మన్ ,ఎమ్మెల్యే మద్య గ్రూపు తగాదాలు ..
*ఎస్టీ రిజర్వేషన్ల మీద ఆయా సామాజిక వర్గం పోరాటాలు చేయడం ..
*ఉద్దానం కిడ్ని బాధితులకు న్యాయం జరగకపోవడం ..
*సోంపేట ప్రజలు టీడీపీ సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం ..
*ఇచ్చాపురం కార్పోరేషన్ లో వైసీపీ కి పట్టుండటం ..
*కొబ్బరి తోట రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విపలం కావడం ..
పనితీరు :
ఇచ్చాపురం ఎమ్మెల్యే పని తీరు టీడీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల కంటే అతి దారుణంగా ఉంది ..
మార్కులు :20 

సంబంధిత వార్తలు