ప్రధాని మోదీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ..

దేశ అత్యున్నత  న్యాయస్థానంలో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీకి ఊరట లభించింది.గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్ర మోదీకి బిర్లా, సహారాల నుంచి పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై  ప్రముఖ వాణిజ్య వ్యాపార సంస్థలు అయిన సహారా, బిర్లాల నుంచి ఆయన ముడుపులు తీసుకున్నారంటూ  సిట్‌తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఒక  ఎన్జీవో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఈ రోజు బుధవారం  తిరస్కరణకు గురైంది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు