మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు అంటూ విక్టరీ గురు టీజర్ విడుదల

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ నేపథ్యంలో సాగే అనేక చిత్రాలలో నటించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు వెంకీ. ఆ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలలో నటించి మంచి హిట్స్ కొట్టిన ఈ సీనియర్ హీరో ఆ తర్వాత రీమేక్ ల బాట పట్టాడు. ఇవి కూడా వెంకీ లిస్ట్ లో హిట్ ల సంఖ్యని పెంచుతున్నాయి. తాజాగా తమిళ సూపర్ హిట్ చిత్రం ఇరుది సుట్రుకి రీమేక్ గా గురు అనే చిత్రాన్ని చేసాడు వెంకీ. ఈ చిత్రం జనవరిలో విడుదల కానుండగా ప్రమోషన్ స్పీడ్ పెంచాడు. ఇప్పుడు ఈ సంబంధించి టీజర్ విడుదల చేసి మరింత హైప్స్ తెచ్చాడు. ‘ మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి .. ’ అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్‌ అదుర్స్ అనిపించింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా సింగ్ కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ స్వరాలు అందించాడు.

సంబంధిత వార్తలు