అంతర్జాతీయ సదస్సుకు వేదికగా తెలంగాణ ..

తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపదల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గొప్ప ప్రయత్నం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ ఈ నెల 16,17వ తేదీల్లో రీడిస్కవరింగ్ తెలంగాణ పేరిట అంతర్జాతీయ సదస్సుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో చైనా, తైవాన్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన బౌద్ధ మహోపాధ్యాయులు, అమెరికా, ఇంగ్లాండ్‌కు చెందిన రిసెర్చ్ స్కాలర్స్, గయ, నలంద ప్రాంతాలకు చెందిన పండితులు పాల్గొననున్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ చారిత్రక ఔన్నత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్తామని రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ విశాలాక్షి పేర్కొన్నారు. సదస్సుకు విశాలాక్ష్మి డైరెక్టర్‌గా, పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభ కో-కన్వీనర్‌గా, రాష్ట్ర ప్రదర్శనశాలల డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మెగాలిథిక్ కాలం నాటి సమాధులపై పలు అంతర్జాతీయ సదస్సుల్లో వ్యాసాలు సమర్పించిన సముద్రాల రంగాచార్య ఈ సదస్సులోనూ వ్యాసాన్ని సమర్పిస్తారు. తెలంగాణలోని కోటలు, సరస్సులు, పాండవుల గుట్ట, లోయలు, పర్యాటక ప్రదేశాలు, బుద్ధవనం ప్రాజెక్ట్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు ప్రాచీన నాణేల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు