మీరు టవల్ వాడుతోన్నారా ..అయితే ఇది మీకోసమే ..?

ఇవ్వాళ రేపు టవల్స్ వాడని ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి.. అయితే మీరు ఉపయోగించే టవల్స్ ను ఎన్ని రోజులకు ఓసారి పరిశుభ్రం చేస్తున్నారని అడుగుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ కీలకంగా మారిన తువ్వాలపైనా పరిశోధన చేశారు. మీ తువ్వాలను 1, 2 రోజులకొకసారి ఉతకాల్సిందేనని చెబుతున్నారు. అంతకు మించితే మాత్రం మీ టవల్స్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. అంటే అప్పటికప్పుడు ఏం కాకపోవచ్చు కాని.. దీర్ఘకాలంలో ఎంతో కొంత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఒకసారి ఉతికి టవల్‌ను మూడుసార్లకు మించి వాడకూడదని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన ఆరోగ్యవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్‌ ఫిలిప్‌ టియెర్నో సూచిస్తున్నారు.

టవల్స్ వాడే ప్రతి ఒక్కరూ చదవాల్సిన విషయం ఇది!! ఇవ్వాళ రేపు టవల్స్ వాడని ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి.. అయితే మీరు ఉపయోగించే టవల్స్ ను ఎన్ని రోజులకు ఓసారి పరిశుభ్రం చేస్తున్నారని అడుగుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ కీలకంగా మారిన తువ్వాలపైనా పరిశోధన చేశారు. మీ తువ్వాలను 1, 2 రోజులకొకసారి ఉతకాల్సిందేనని చెబుతున్నారు. అంతకు మించితే మాత్రం మీ టవల్స్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. అంటే అప్పటికప్పుడు ఏం కాకపోవచ్చు కాని.. దీర్ఘకాలంలో ఎంతో కొంత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఒకసారి ఉతికి టవల్‌ను మూడుసార్లకు మించి వాడకూడదని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన ఆరోగ్యవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్‌ ఫిలిప్‌ టియెర్నో సూచిస్తున్నారు. ఒంటిని శుభ్రపరచుకోవడానికి తువ్వాళ్లను వాడుతుంటామని.. కానీ, మూడుసార్లకు మించి వాడితే అవే మన అనారోగ్యాలకు కారణమవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. మూడుసార్లకు మించి వాడే టవల్స్‌ బ్యాక్టీరియా, ఫంగస్, మలమూత్ర రేణువులు, మృతచర్మకణాలు, మరుగుదొడ్లిలో ఉండే రకరకాల సూక్ష్మజీవులకు నిలయాలుగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒక టవల్‌ను ఒకరికి మించి వాడారంటే అనారోగ్యం ముప్పు మరింత ఎక్కువని, ఒకరి తుండు మరొకరు వాడటమనే ప్రసక్తే వద్దని ఆయన చెబుతున్నారు. ఏది ఏమైనా టవల్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. మంచిదే కదా…

సంబంధిత వార్తలు