ఖైదీ నెంబర్ 150 లో ఏపీ సీఎం బాబుకు కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్ ..

టాలీవుడ్ మెగాస్టార్ దాదాపు పది యేండ్ల విరామం త‌ర్వాత రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో ఈ రోజు గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఖైదీలో ప‌లు డైలాగులు బాగా పేలాయి. ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌ల‌పై చిరు చెప్పిన డైలాగుల‌కు థియేట‌ర్లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది

ఖైదీ డైలాగుల‌ను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌తో పాటు వేమారెడ్డి, బుర్రా సాయిమాధ‌వ్ డీల్ చేశారు. ఈ డైలాగుల్లో ఒక డైలాగ్ ఏపీ సీఎం చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసి చెప్పిన‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. చిరు నేరుగా చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా ఆ డైలాగ్ మీనింగ్ చంద్ర‌బాబుని ఉద్దేశించి చెప్పిన‌ట్టుగానే స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా లో ఒక సీన్‌లో చిరు రైతుల బాధ‌ల‌పై మాట్లాడుతుండ‌గా మ‌రో వ్య‌క్తి రైతుల కోసం ప్ర‌భుత్వాలు రుణ‌మాఫీ చేస్తున్నాయిగా అంటాడు. అప్పుడు వెంట‌నే చిరు రైతుల‌కు రుణ‌మాఫీనా ? ఎక్క‌డ చేస్తున్నారు ? ఎంత చేస్తున్నార‌ని ? కౌంట‌ర్ వేస్తాడు. ఈ డైలాగ్ ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి చెప్పిందేనా అన్న టాక్ న‌డుస్తోంది. ఇక్క‌డ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక లోటు వ‌ల్ల ఆ రుణ‌మాఫీని క్ర‌మ‌క్ర‌మంగా మాఫీ చేసుకుంటూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.ఇక ఇదే క్ర‌మంలో చిరు గ‌ల్లి నుండి ఢిల్లీ పాలిటిక్స్ వ‌ర‌కు త‌ట్టుకున్న గుండెరా ఇది – సముద్రం ఒడ్డున నిల‌బ‌డి, స‌ముద్రం వెన‌క్కి వెళ్లింది క‌దా అని న‌వ్వితే, అదే స‌ముద్రం సునామీతో ముంచేస్తుంది – అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను – న‌వ్వుకునే వాడు ఓరోజు ఏడ్చే రోజు వ‌స్తుంది అంటూ బాబును టార్గెట్ చేసినట్లు అంటున్నారు .

సంబంధిత వార్తలు