Andhrapradesh

ఓటన్నా మనకు వేస్తారో లేక మట్టసనంగా అన్ని ఓట్లు ఆపక్క ఏసేస్తారా అంటూ తెలుగుతమ్ముళ్ల హైరానా

నంద్యాలలో టీడీపీ పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంలా మారుతోంది.. ఎంత ఇచ్చినా, ప్రచారంలో తిప్పుకుంటున్నా, నెత్తిన టోపీ, చేతిలో పసుపు జెండా పెట్టినా డబ్బులు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం వైసీపీపై అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు.. తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా, శిల్పా మోహన్ రెడ్డి ఇతర వైసీపీనేతలు వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు..

 

నంద్యాల లో 1-28వార్డులలో ఎవరికి ఎంత మెజారిటీ ..?

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ నంద్యాల ఉప ఎన్నికల సమరం .వచ్చే సార్వత్రిక ఎన్నికల మహాసమరానికి ముందుగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికలపైనే అందరి చూపు పడింది .మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు .ఈ నేపథ్యంలో నంద్యాల నియోజక వర్గంలో ప్రధాన కేంద్రమైన నంద్యాలలో వైసీపీ పరిస్థితి ,టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఒక లుక్ వేద్దామా ..?

నంద్యాల‌లో రోజాకు దొరికి సెన్షేష‌న‌ల్ ఐటం.. !

నంద్యాల ఉప ఎన్నిక ఎక్క‌డా లేని విధంగా హ‌ట్ టాపిక్‌గా మారిన నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా అక్క‌డ రోజుకో సంచ‌ల‌నం న‌మోద‌వుతుంది. దీంతో పాటే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో హీట్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఒకప్పటి తన సహచర హీరో నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో లో ఆమె మాట్లాడతూ, నంద్యాలలో ఫ్యాన్‌ గాలి గట్టిగా వీస్తోంద‌ని బాలయ్యకు అర్థమయ్యిందని..

దారుణం.. చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో వ్యక్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద దుర్ఘటన జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓవ్యక్తి ఏపీ సచివాలయం వద్ద ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తన బాదలు చెప్పుకోవాలని అక్కడకు రాగా, శుక్రవారం ఉదయం నుంచి అతను సాయంత్రం వరకు రాజగోపాల్ అనే ఇతను వెలగపూడి సచివాలయం వద్ద వేచి చూశాడు.

 

నంద్యాల‌లో క‌నీవినీ ఎరుగ‌ని విధంగా.. సంచ‌ల‌నం రేపుతున్న‌"జులాయి" ..!  

ఏపీ నంద్యాల ఉప ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ అధికార టీడీపీ నిజస్వరూపాలు ఒక్కొక‌టిగా బయటపడుతోంది. డబ్బు, దౌర్జన్యాలు, అభాండాలు.. ఈ మూడు అంశాలను ఆధారం చేసు కుని ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవడానికి అది పావులు కదుపుతోంది. గెలుపు క‌ష్ట‌మ‌ని గ్ర‌హించిన టీడీపీ అడ్డదారులను ఆశ్రయిస్తోంది. ఇక చంద్ర‌బాబు వ‌స్తున్న‌ నేపథ్యంలో నంద్యాలలో కంటైన‌ర్ హాట్ టాపిక్‌గా మారింది. నంద్యాల‌లో డ‌బ్బుతో కంటైన‌ర్ వ‌స్తోంద‌ని స‌మాచారం ఇచ్చి అస‌లు డ‌బ్బు ఉన్న వాహ‌నాన్ని ప‌క్క‌దారిలో పంపించేశార‌ని అక్క‌డి స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు.

చంద్రబాబు రోడ్ షోకు ఆదిలోని ఆటంకం.. !!

జగన్ కి దీటుగా నంద్యాలలో ప్రచారం చేసేందుకు చంద్రబాబు రెఢీ అయ్యారు. అందుకోసం ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. అయితే అంతలోనే చంద్రబాబుకు ఆటంకం ఎదురైంది.  ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి నుంచి నంద్యాలకు బయల్దేరారు. ఈరోజు, రేపు ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే, నంద్యాలలో చంద్రబాబు రోడ్ షో ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆయన ప్రచారానికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈరోజు అయ్యలూరిమెట్ట నుంచి నంద్యాల వరకు నాలుగు చోట్ల ముఖ్యమంత్రి రోడ్ షో జరగనుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రచారం సంజీవ్ నగర్, రామాలయం, పెదబండ సత్రం ప్రాంతాలలో కొనసాగనుంది.

నంద్యాల ఎన్నికపై చంద్రబాబు వద్ద ఉన్న నివేదిక ఏంటో తెలుసా.?

రాష్ట్రంలోని నంద్యాల ప్రజలకు ఓ అద్బుతమైన అవకాశం వచ్చిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే సీఎం చంద్రబాబు శాంతి భద్రతలు, ఇంకొకటి అని కొత్త పల్లవి అందుకున్నారని కోటంరెడ్డి అన్నారు. రాష్ట్రప్రజలకు గత మూడేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలకు సమాధానం చెప్పే అవకాశం నంద్యాల ప్రజలకు అందరికన్నా ముందుగా వచ్చిందన్నారు కోటంరెడ్డి. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు.

 

ఏపీ సచివాలయంలో దారుణం..

ఏపీలో ఉన్న ప్రజల వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది .గత సార్వత్రిక ఎన్నికల్లో తమను గెలిపిస్తే అమలు కానీ హామీలను కురిపించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గాలికి వదిలేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్లక్ష్యానికి చిద్రమైన సామాన్యుల బ్రతులకు నిదర్శనం ఈ సంఘటన ఇది .

చంద్రబాబుకి ఝలక్ ఇచ్చిన టీడీపీ సీనియర్‌ నేత..

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(తుడా) చైర్మన్‌ నరసింహ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకొన్నారు . ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డంగా కారును నిలపడంతో తిరుపతిలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి .

సంబంధిత వార్తలు