Bakthi

బుద్ధం శరణం గచ్ఛామి..!

budda,jayanthi,spiritual,god

బుద్ధుణ్ని చూడగలిగే కళ్లు ఉన్నప్పుడు, ఆ దృష్టి ఏర్పడినప్పుడు ప్రతి క్షణమూ ఆయన దర్శనమిస్తూనే ఉంటాడు! ‘ప్రకృతిలోనే దైవాన్ని చూస్తున్నాను. అనుక్షణం ఆయనతో అనుభవాలు పొందుతున్నాను. భగవానుణ్ని కలుసుకోకుండా నా శ్వాస ఆడదు. అంతటా ఆయనే కనిపిస్తున్నాడు. ఆ దివ్యనాదాన్ని నేను వింటున్నాను’ అనుకుంటాడు సాధకుడు. రాత్రిపూట నక్షత్రాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, వాటి గురించి ఏ ఆలోచనా చేయకుండా కేవలం దర్శిస్తే చాలు. విశాలమైన కడలిలో అలలు నాట్యాలు చేస్తున్నప్పుడు, ఇతర తలంపులేవీ లేకుండా అటే తిలకిస్తుంటే చాలు. ఓ మొగ్గ పువ్వుగా మారి విచ్చుకుంటున్నప్పుడు, గమనిస్తుంటే...

శ్రీరామనవమి శుభాకాంక్షలు

Governor Narasimhan, CM KCR, Sri Ramanavami,Telangana, AndhraPradesh

తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుహాకాంక్షలు. శ్రీ రామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామపదంలోని మాధుర్యం సృష్టినే తాదాత్మ్యంలో ముంచేస్తుంది. రామ అన్న పదం ఎన్నిసార్లు విన్నా, చదివినా తనివి తీరదు. రామ పదాన్ని నిలువెత్తు రూపంగా ధరించి మానవ జన్మ సార్థకమయింది. మానవత్వానికి భాష్యం చెప్పిన మానవీయుడే శ్రీరామచంద్రుడు. మనిషి జీవితంలో రెండు పార్శాలుంటాయి. అందులో ఒకటి వ్యక్తిగతం. రెండవది సామాజికం. రెండూ ఉదాత్తంగా ఉన్నప్పుడే మనిషి పుట్టుక చరితార్థమవుతుంది.

షడ్రుచుల ఉగాది..

ugadi, festival, telangana, andhrapradesh, telugu, festival

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరంగా పేరొందిన ఉగాది విశిష్టతను తెలుసుకుంది. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అనే సంస్కృత పదానికి వికృతి. బ్రహ్మ దేవుడు  సృష్టిని ఆరంభించిన రోజు ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ గా మొదటనుండి ఆచారంగా వస్తుంది. అనంతమైన, అద్భుతమైన, మహోన్నతమైన సకల చరాచర సృష్టికీ ఆది యుగాది. జగత్తులోని ప్రతి ప్రాణి జీవనంలో మార్పును తీసుకవస్తూ జీవన ఒరవడిలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఆహ్లాదాన్ని పంచే పండుగ ఇది. బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టిన యేడాది మొదటి మాసం, తొలిరోజును ఉగాది పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

"ఉగాది" ఆచరణ విధానం: 

How to Celebrate Ugadi

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

ప్రకృతికి కృతజ్ఞతే..కలర్ ఫుల్ "హోలీ" (స్పెషల్ స్టోరీ)

నేడు హోలీ పండుగ జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ కలర్ ఫుల్ హోలీ గురించి తెలుసుకుందామా..

మహా శివరాత్రి విశిష్టత ఏమిటి? పరమ శివుడిని ఏ విధంగా పూజించాలి?

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి.దేశ వ్యాప్తంగా ఈ రోజు శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి..ప్రతి ఏటా  మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత

సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు..

హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.
 

గోదాదేవి వ్రత మహత్మ్యం ఏమిటి? పాశురాల్లో గోదాదేవి శ్రీరంగనాథుడిని ఏవిధంగా కీర్తించింది..?

శ్రీ గోదాదేవి చరితం - పాశురం 1

అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు

ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్

పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై

శూడి కొడుత్తాళై చ్చోల్లు
శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై

పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ

వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం

నాంగడవా వణ్ణమే నల్గు
"అన్నవయల్ పుదువై ఆండాళ్"

కుప్ప‌లు తెప్ప‌లుగా పాత నోట్లు దేవాల‌యాల హుండీల‌లో....మొత్తం న‌ల్ల‌డ‌బ్బేనా..!!

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌ముఖ దేవాల‌యాల హుండీల ఆదాయం అనూహ్యంగా పెరిగింది. కుప్ప‌లు తెప్ప‌లుగా పాత నోట్లు దేవాల‌యాల హుండీల‌లో వ‌చ్చిప‌డుతుంది. ప్ర‌స్తుతం చిల్ల‌ర‌క‌ష్టాలను అధిగ‌మించేదుకు ఆయా దేవాల‌యాల హుండీలలో వ‌చ్చిన చిల్ల‌ర‌ను లెక్కించి ఆయా బ్యాంకుల‌లో డిపాజిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హుండీల‌లో వేసిన డ‌బ్బుపై నిఘా ఉంచారు. దీంతో పాత నోట్లు భారీగా వ‌చ్చి ప‌డుతుంద‌ని విష‌యాన్ని ఆల‌య అధికారులు గుర్తించారు. గ‌తంలోకంటే ప్ర‌స్తుతం హుండీల ఆదాయం ఘ‌న‌నీయంగా పెరిగింది.

సంబంధిత వార్తలు