Business

ప్రేమికుల‌రోజు బంపర్ ఆఫర్ అతి త‌క్క‌వ రేటుకే విమాన ప్రయాణం....

వాలెంటైన్స్ డే’ పురస్కరించుకుని విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899కే విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించనుంది. అయితే, ఈ ఆఫర్ ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి సెప్టెంబరు 20 లోపు తీసుకునే టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. గౌహతి నుంచి బాగ్‌డోగరాకుఅన్ని రకాల ట్యాక్సులు కలిపి ప్రారంభ ధర కింద రూ.899కే టికెట్ లభిస్తుంది. ఇది ఒక వైపు ప్రయాణానికి మాత్రమే. అలాగే, ఇతర ప్రాంతాలకు కూడా తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది.

భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం ధర భారీగా పతనమైంది. ఏకంగా మూడు వారాల కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం దేశ రాజధానిలో రూ.400 తగ్గిన 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.29,500 పలికింది. స్థానిక ఆభరణాల తయారీదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడం ధర తగ్గడానికి ప్రధాన కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కిలో రూ.490 తగ్గి రూ.42,250కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో వెండి ధర తగ్గింది. అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల కూడా రెండు లోహాల ధరలూ తగ్గాయని ట్రేడర్స్‌ తెలిపారు. అంతర్జాతీయంగా 0.42శాతం తగ్గిన బంగారం ధర ఔన్సు 1,222.70 అమెరికన్‌ డాలర్లు పలికింది.

ఇక నుండి సెల్‌ఫోన్ల ధరలు ఇలా ఉండ‌బోతున్నాయి..

కొత్తగా మొబైల్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకున్న వారికి కొంచెం చేదువార్తే. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి సెల్‌ కొనడానికి ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకన్నా 1-2శాతం ఎక్కువే చెల్లించాల్సి వస్తుందట. కేంద్ర బడ్జెట్‌ 2017-18 ప్రకారం భారత్‌లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లపై స్పెషల్‌ అడిషనల్‌ డ్యూటీ(ఎస్‌ఏడీ) విధించనున్నారు. పాపులేటెడ్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌(పీసీబీ)పై దీనిని విధించే అవకాశం ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ వంటింది. మొబైల్‌ ఫోన్‌ తయారీలో సగం ఖర్చు వీటికే వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1-2శాతం ఎస్‌ఏడీ విధించనున్నారు.

VODAFONE,IDEA రెండు క‌లిపి ఒక్క‌టే...

జియోకు చెక్ పెట్టేందుకు ప్ర‌ముఖ దిగ్గజ టెలికాం సంస్థలు ఏకం కానున్నాయి. ఉచిత డేటా వంటి సెన్సేషల్ ఆఫర్లతో ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జియోను ఎదుర్కొనేందుకు, అలాగే భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టేందుకు వొడాఫోన్, ఐడియాలు ఏకం కానున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో వొడాఫోన్‌కు చెందిన అన్ని షేర్లను కలిపేందుకు చర్చలు జరుగుతున్నాయి.

నష్టాల‌లో BSNL

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు తగ్గాయి. డిసెంబర్‌ 31 నాటికి సంస్థ రూ.4,890 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి రూ.6,121 కోట్ల నష్టాలతో ఉండటం విశేషం. తొమ్మిది నెలల సమీక్ష అనంతరం ఈ వివరాలను వెల్లడించింది. ఇక సేవల నుంచి వచ్చే ఆదాయంలో వృద్ధిని కనబరిచింది. రూ.18,314.9కోట్ల నుంచి రూ.19,379.6 కోట్లకు చేరుకుంది. ఇక బలమైన నాలుగో త్రైమాసికంలో ద్వారా నష్టాలు మరింత తగ్గే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ అంచనా వేస్తోంది.

వాట్సాప్‌ యూజర్ల కోసం...దిమ్మతిరిగే లొకేషన్‌ ఫీచర్‌..

కొత్త కొత్త మార్పులతో దూసుకుపోతున్న ప్రముఖ మెసెంజర్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వీడియో కాలింగ్‌, జిఫ్‌ షేరింగ్‌ వంటి సదుపాయాలతో వినియోగదారులకు బాగా చేరువైన వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌లో లైవ్‌ లొకేషన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం.. వాట్సాప్‌ గ్రూపులో లైవ్‌ లొకేషన్‌ సదుపాయం ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది.

ఈ నెల 31న జియోకు పోటీగా ఐడియా బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌ట‌న‌..

జియోకు పోటీగా ఐడియా సంస్థ సిద్ధమైంది. జియో టీవీ, జియో మూవీస్‌, జియో మ్యూజిక్‌ తరహాలో ఐడియా కూడా అటువంటి యాప్స్‌ను తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యింది. ఈ నెల 31న ‘డిజిటల్‌ ఐడియా’ పేరిట యాప్స్‌ సూట్‌ను తీసుకురానుంది. ఇందులో ఐడియా మూవీస్‌, టీవీ, మ్యూజిక్‌, గేమ్స్‌ యాప్స్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారుచేసింది. ఇటువంటి మీడియా స్ట్రీమింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ద్వారా డేటా వినియోగం పెరిగి తద్వారా మొబైల్‌ డేటా నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఆ సంస్థ భావిస్తోంది. దీని ద్వారా సంస్థ డిజిటల్‌ సొల్యూషన్‌ కంపెనీగా అవతరిస్తుందని ఐడియా పేర్కొంది.

భారిగా త‌గ్గిన బంగారం ధరలు

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ప్ర‌స్తుతం ఒక్కసారిగా తగ్గడం ప్రారంభించింది. రిప‌బ్లిక్ డే రోజు కాస్త త‌గ్గిన బంగారం ధర... శుక్రవారం కూడా కాస్తా త‌గ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి ప్రస్తుతం 29,150కి చేరింది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి. కేజి వెండి ధర రూ.550 తగ్గి రూ. 40,950కి చేరింది. బంగారం కొంటున్న వినియోగదారులు తగ్గడంతో వ్యాపారులు కూడా పసిడి కొనుగోలు తగ్గించారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలు కూడా దిగొస్తున్నాయి.

రిపబ్లిక్ డే గిఫ్ట్ -బంపర్ ఆఫర్స్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రైవేటు టెలికాం సంస్థల నుండి వస్తోన్న పోటీని తట్టుకోవడానికి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు రిపబ్లిక్ డే సందర్భంగా బంపర్ ఆఫర్స్ ను ప్రకటించింది .అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం మూడు ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ.26తో రీఛార్జ్‌ చేయడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిధిలో 26గంటల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంతో పాటుగా ఈ ఆఫర్‌ ఈ రోజు అనగా జనవరి 25 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

BSNL భారి ఆఫ‌ర్ అన్ లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.149తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్‌(లోకల్‌/ఎస్టీడీ)ను 30రోజుల పాటు పొందవచ్చు. అంతేకాకుండా రూ.439తో రీఛార్జ్‌ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మించి వాయిస్‌కాల్స్‌ చేసుకునే వెసులుబాటు లేదు. తాజా పథకం జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకు వర్తిస్తుంది.

సంబంధిత వార్తలు