Crime

వీడికి 21 సంవత్సరాలు..200 మంది మహిళలపై అత్యాచారం..500 మందిని అతి దారుణంగా హత్య...

మానవ రూపంలో క్రూరమృగం ఈ అమర్‌ హుస్సేన్‌...చూడ‌టానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు..కాని అత్యంత దుర్మార్గుడు .. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిగా ఉన్న ఇతడు దాదాపు 200 మంది అమాయక మహిళలపై అత్యాచారాలు చేశాడు... 500 మందిని అతి దారుణంగా హత్యచేశాడు. ఇన్ని దురాగాతాలు చేసిన హుస్సేన్‌ కుర్దు దళాలకు చిక్కిపోవడంతో అతను చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
గాలింపుల పేరుతో...

హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో విషాదం..

హైదరాబాద్‌ నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. సొహైల్‌ అనే వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తూ ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని వట్టేపల్లికి చెందిన అమిత్‌షాగా గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా మైలార్‌ దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సొహైల్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

మెల్ల‌గా అలా ఇలా బతుకుదామ‌ని ఈ మ‌హిళ హైదరాబాద్ రాలేదు...ఏకంగా..

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డకు చెందిన నానావతి కళావతి అనే మహిళ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌ వచ్చింది. అక్కడ రైల్వే స్టేషన్‌ను అడ్డాగా చేసుకొని విటులను ఆకర్షిస్తూ సెవెన్‌హిల్స్‌ లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తూ వస్తోంది. ఇందుకోసం ఆమె లాడ్జీ యజమానిని వలలో వేసుకుంది. దీంతో ఆయన తన లాడ్జీలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు.

కట్టుకున్న భార్యను,పసిబిడ్డను అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ వదిలేసి ఎన్నారై పలాయనం..!

అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు..నెలకు లక్షల్లో జీతం , తమ బిడ్డ జీవితాంతం సుఖపడుతుందనే ఆశతో ఎన్నారై సంబధాలు చూసి వివాహాలు చేస్తున్నారు..అయితే ఆ ప్రబుద్ధులు మాత్రం కొన్నాళ్లు కాపురం చేసి..మళ్లీ ఎక్కువ కట్నం వస్తుందనే ఆశతో కట్టుకున్న భార్యబిడ్డలను వదిలించుకోవడానికి వారిని నానా చిత్ర హింసలు పెట్టి వారిని ఇండియాకు తన్ని తరిమేస్తున్నారు..ఇలాంటి ఎన్నారైల మోసాలకు ఎందరో అమాయక ఆడపిల్లలు  బలైపోతున్నారు.. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సాక్షిగా మరో ఎన్నారై మోసం  బట్టబయలైంది..

షారుక్ ఖాన్‌పై రైల్వే పోలీసులు కేసు....

రైల్వే ఆస్తులపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేసినందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌పై రైల్వే పోలీసులు కేసు పెట్టారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వేస్టేషన్ వద్ద తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన వచ్చినప్పుడు ఈ పనిచేశాడని, ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. కోటా రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం మీద ఉన్న ఓ వర్తకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రైల్వేకోర్టు షారుక్‌పై కేసు పెట్టాలని సూచించడంతో జీఆర్పీ సిబ్బంది కేసు నమోదుచేశారు.

సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తాడని త‌ల్లి... ల‌వ‌ర్ కోసం పురుగుల మందు తాగిన కొడుకు..

‘ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని ఉంది. దయచేసి ఒక్కసారిగా బయటకు రా. నిన్ను చూడకుండా ఉండడం నావల్లకాదు. ఈ బాధ భరించలేను. ఇది నీవు నమ్మవచ్చు.. నమ్మకపోవచ్చు. నేను అంటే నీకు ఇష్టంలేకపోవచ్చు. కానీ నా మనస్సు నీతో మాట్లాడాలంటుంది... నీవు రాకుంటే చనిపోవాలనుంది అంటూ వూపిరి వదిలేవరకు ప్రాణసఖితో ఫోన్‌లో మాట్లాడుతూనే ప్రాణాలు వదిలాడు ఎలమంచిలి పట్టణానికి చెందిన ఓ ప్రేమికుడు. స్థానిక ఎస్సై దీనబంధు, స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం...

ప్రేమికుల రోజు అంద‌రు సంబరాల మధ్య ఉండగా.... అత్యంత భయంకరమైన ఘటన..

ప్రేమికుల రోజు ఢిల్లీ నగరమంతా కాస్తంత సంబరాల మధ్య ఉండగా నగర పోలీసులు మాత్రం ఓ అవాక్కయ్యే కేసును పట్టుకున్నారు. కట్టుకున్న భార్యను కడతేర్చి కసాయిగా ఆమె తలను మొండేన్ని వేరు చేసిన భర్తను అరెస్టు చేశారు. అత్యంత భయంకరమైన ఈ ఘటన మూడు రోజుల కిందే జరిగింది. తన భార్యను చంపేసిన ఆ వ్యక్తి మూడు రోజులపాటు ఆమె మృతదేహంతోనే కలిసి ఉన్నాడు. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని మధు విహార్‌ అనే ప్రాంతంలో సుబోధ్‌ కుమార్‌ (40) అనే వ్యక్తి మనీషా భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రేమ జంట‌ పురుగులమందు తాగి ఆత్మహత్య..

ప్రేమికుల దినోత్సవానికి ఒక్కరోజు ముందు... తాము ప్రేమలో ఓడిపోయామంటూ తీవ్ర మనస్తాపంతో ఓ జంట పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల సమీపాన సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన మధు(22), ఓ బాలిక (16) ప్రేమికులు. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణ కేసు కింద మధును రిమాండుకు తరలించారు.

రైలు ప్ర‌మాదం... 22 బోగీలు నదిలోకి

అమెరికాలోని కాలిఫోర్నియాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 22 బోగీలు నదిలోకి పడిపోయాయి. అదృష్టవశాత్తు గూడ్సు రైలు కావడంతో ప్రాణహాని జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. గ్రేటర్‌ శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ట్రేసీ సిటీ నుంచి స్కార్‌మెంటో మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని రోజ్‌విల్లేకు ఆహార పదార్థాలను తరలిస్తున్న రైలు ఎల్క్‌గ్రోవ్‌ సిటీ వద్ద ప్రమాదానికి గురైనట్లు యూనియన్‌ పసిఫిక్‌ రైల్‌బోర్డ్‌ అధికార ప్రతినిధి జస్టిన్‌ జాకోబ్స్‌ తెలిపారు. రైలులో 33 బోగీలుండగా 22 బోగీలు ఉప్పొంగి ప్రవహిస్తున్న కోసుమీస్‌ నదిలోకి పడిపోయినట్లు వెల్లడించారు.

లాహోర్‌లో భారీ బాంబు పేలుడు..

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పంజాబ్‌ అసెంబ్లీ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 16మంది మృతిచెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు