Movies

'మహానుభావుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కింది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ మెరవనుంది. ఈ సినిమాలో అతి శుభ్రత అనే మానసిక వ్యాధితో బాధపడే యువకుడిగా శర్వానంద్ కనిపించనున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ కు .. టీజర్ .. ట్రైలర్ .. ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో, టీమ్ అంతా కూడా ఎంతో హ్యాపీగా వున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 24న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వేదిక ఎక్కడనేది ప్రకటిస్తారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'జై లవ కుశ' ..

'జై లవ కుశ సినిమాపై.. టీడీపీ నెగిటివ్‌ ప్రచారాలు

టాలీవుడ్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ పార్టీ శ్రేణులు మరోసారి దుష్ప్రచారనికి తెగబడ్డారా?. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు విడుదలైన సందర్భంలో చేసినట్లుగానే తాజాగా 'జై లవ కుశ' చిత్రం విషయంలోనూ ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయా సోషల్‌మీడియా వేదికల్లో ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారం ఆ విషయాన్నే నిర్థారిస్తోంది.

షకీలా గుండెపోటుతో కన్నుమూత

సీనియర్‌ నటి షకీలా (82) కన్నుమూశారు. బుధవారం ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నేడు (గురువారం) ప్రకటించారు. షకీలా బంధువు, నటి నాజిర్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. బాబూజీ ధీరే చల్నా...బార్‌ బార్‌ దేఖో.. హజార్‌ బార్‌ దేఖో అంటూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న షకీలా...రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌, గురుదత్‌ లాంటి బాలీవుడ్‌లో హీరోలతో కలసి నటించారు.

జూనియర్ ఎన్టీఆర్ కు జై కొట్టిన జక్కన్న ..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రీలీజ్ అయిన లేటెస్ట్ మూవీ జై లవకుశ .నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో రాశిఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా పని చేశాడు .ఉదయం విడుదల అయిన బెన్పిట్ షో దగ్గర నుండి మూవీ బ్లాక్ బ్లాస్టర్ అంటూ సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తోన్నారు .

జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు పయనం..

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ పెద్ద హిట్ట‌యింది. ఇక ఆయ‌న త్వర‌లోనే విదేశాలకు పయనం కానున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయనుండగా , ఇందులో ఎన్టీఆర్ చాలా స్లిమ్‌గా కనిపించాలట. అందుకని తన శరీరాన్ని మౌల్డ్ చేస్తుకునేందుకు యూరప్ వెళ్లి అక్కడ ఓ నెల రోజుల పాటు 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడట. ఈ థెరపీ ముఖ్య ఉద్దేశం శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడం ఇక ఇది పూర్తైన తరువాత అక్కడి నుంచి మలేసియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటాడని అంటున్నారు.

ఎన్టీఆర్‌ నటనకు రాజమౌళి ఫిదా.. ‘తారక్‌ గురించి మాటలు సరిపోవు

‘నేటి యువతరంలో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని అడిగితే.. ఆయన మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు ఎన్టీఆర్‌. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు కూడా. మరోసారి ఎన్టీఆర్‌ నటనకు రాజమౌళి ఫిదా అయిపోయారట. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘జై లవకుశ’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ నటన, డ్యాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘జై లవకుశ’ సినిమాను చూసిన రాజమౌళి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘తారక్‌.. నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. మాటలు సరిపోవు. జై..

బాలయ్య ఫ్యాన్స్ కు జూనియర్ ఎన్టీఆర్ షాక్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ,నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన మూవీ "జై లవకుశ ".ఈ రోజు మొదటి షో నుండే మూవీ మంచి హిట్ టాక్ తో ఇండస్ట్రీను షేక్ చేస్తోంది.

ఎన్టీఆర్ నటించిన జై లవకుశ కూడా పైరసీ

టాలీవుడ్ షేక్ చేస్తున్న పైరసీ.. ప్రతి సినిమాకు పట్టి పీడిస్తున్న రాకాసి. దీనిని అంతం చేయాలనీ ఎంత ట్రై చేసిన వీలుకావడం లేదు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పైరసీ మరి ఎక్కువయ్యింది. ప్రతి ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ , దానిలో ఫ్రీ నెట్..ఇంకేమి కావాలి పైరసీ చేయడానికి..తమ కు నచ్చిన సీన్, నచ్చిన ఫైట్ , నచ్చిన సాంగ్ ఇలా అన్ని కూడా సినిమా చూస్తుండగానే సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పైరసీ చేస్తున్నారు.

నా లైఫ్‌లో నేను చేసిన‌ పెద్ద తప్పు అదే.. జూనియ‌ర్ ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక వైపు బిగ్‌బాస్ షోతో మ‌రోవైపు జైల‌వ‌కుశ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా జైల‌వ‌కుశ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఓ ఆశ‌క్తిక‌ర విష‌యాని చెప్పారు ఎన్టీఆర్. అస‌లు విష‌యం ఏంటంటే తార‌క్ పాతికేళ్ళ వ‌య‌సులోనే రాజ‌కీయ ప్ర‌చారంలోకి ప్రచారంలోకి దిగాడు. అద్భుతమైన ప్రసంగాలతో అప్పట్లో జనాల్ని ఉర్రూతలూగించాడు. ఇక ఆ ఎన్నిక‌ల త‌ర్వాత ఏంజ‌రిగిందో కాని టీడీపీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తూ.. రాజకియాలపై పెద్దగ పటించుకోవట్లేదు. అయితే ఇప్పుడు 2009లో ఎన్నికల ప్రచారంలోకి దిగి తాను ప‌ద్ద త‌ప్పు చేశాన‌ని ఎన్టీఆర్ మాట్లాడటం విశేషం. 

సాయిధరమ్ తేజ్ తో - నాగబాబు కుమార్తె నిహారికకు పెళ్లా ?

మెగా హీరో సాయిధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక‌లకు త్వరలో వివాహం జరుగనుందనే వార్తలపై సాయిధరమ్ తేజ్ స్పందించిన సంగతి తెలిసిందే. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని స్పష్టం చేశాడు. తాజాగా సినీ నటుడు, మెగా సోదరుడు నాగబాబు తనదైన శైలిలో సాయి, నిహారికల పెళ్లి వార్తపై స్పందించారు. సాయిధరమ్ తేజ్-నిహారిక కుటుంబాల మధ్య పెళ్ళి మాటలు జరుగుతున్నాయనే వార్తలపై నాగబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. అదొక ఫూలిష్ న్యూస్ అని చెప్పారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పుకొచ్చారు. నిహారికను తేజు ఎత్తుకుని తిరిగేవాడనీ..

సంబంధిత వార్తలు