Sports

భారత్‌ ఘనవిజయం..

టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 రన్స్ చేసింది. ఒక దశలో మూడొందలకు పైగా సునాయాసంగా సాధిస్తుందనుకున్నా.. చివర్లో భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

రెండో వన్డేలో ధోనీ.. కళ్లు చెదిరే స్టంపింగ్..వీడియో

ఈ మధ్యే వన్డేల్లో వంద స్టంపింగ్స్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచిన ఎమ్మెస్ ధోనీ.. మ‌రోసారి త‌న మ‌హేంద్ర జాలాన్ని చూపించాడు. వికెట్ల వెన‌కాల మెరుపు వేగంతో క‌దిలే మిస్ట‌ర్ కూల్‌.. క‌ళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్‌ అనిపించాడు. గురువారం జరిగిన రెండో వన్డేలోనూ ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు .మెరుపు వేగంతో బ్యాట్స్ మెన్ ని స్టంప్ అవుట్ చేసే ఎంఎస్ ధోనీ... ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. అది ఎంతో కీలకమైన మ్యాక్స్‌ వెల్ వికెట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. చాహల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌ వెల్‌ను స్టంపింగ్ చేసిన తీరు.. మ్యాచ్‌ కే హైలైట్ గా నిలిచింది.

హీరోయిన్‌ కాజోల్‌ తో.. యువరాజ్‌ సింగ్‌ అక్కడ అలా కలిశారు

టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ తన అభిమాన నటితో ఫొటో దిగి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువరాజ్‌ సింగ్‌ అబిమాన నటి హీరోయిన్‌ కాజోల్‌. తాజాగా వీళ్లిద్దరూ ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోనే ఇది. ‘విమానం రాక ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం’ అని పేర్కొన్న యువీ.. కాజల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఇదే ఫొటోను కాజోల్‌ కూడా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. శ్రీలంక, ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ యువీకి స్థానం కల్పించని సంగతి తెలిసిందే.

భారత్ ఘన విజయం

రెండో వన్డేలో భారత్ ఆస్ట్రేలియాపై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. రహానే 55, శర్మ 7, కోహ్లీ 92, పాండే 3, జాదవ్ 24, ధోనీ 5, పాండ్యా 20, భువనేశ్వర్ కుమార్ 20, బుమ్రా 10, చాహల్ ఒక పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 1, నీల్ 3, రిచర్డ్‌సన్ 3, అగర్ 1 వికెట్ తీశారు. అనంతరం 253 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా పేలవంగా ఆడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లను భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే పెవీలియన్‌కు పంపాడు. కెప్టెన్ స్మిత్ బాధ్యతాయుతంగా ఆడి 59 పరుగులు సాధించాడు.

బాలీవుడ్‌ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్‌

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్‌ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్‌ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్‌ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్‌ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ ఆట తీరు ఎంతో ఇష్టమని.. తన ఫేవరేట్‌ క్రికెటర్‌ కూడా విరాట్‌ అని తెలిపింది. అంతేకాదు కోహ్లీ మరో సచిన్‌ అని, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడని పేర్కొంది.

రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా గత జట్టుతోనే బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. ఆస్టన్ ఆగర్, కేన్ రిచర్డ్ సన్ లను ఆసీస్ తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆడమ్ జంపా, ఫాల్కనర్లకు విశ్రాంతినిచ్చింది.

యువరాజ్‌ సింగ్‌ కు కచ్చితంగా జట్టులో స్థానం

భారత క్రికెట్ జట్టులో అలవకుగా సిక్స్ లో కొట్టే యువరాజ్‌ సింగ్‌ కెరీర్‌లో సెప్టెంబరు 19 ఎంత ప్రత్యేకమైందో అందరికీ తెలిసిందే. సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో యువీ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో యువీ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. తాజాగా యువీ ఈ రికార్డుపై మాట్లాడుతూ...‘ నేను గాల్లోకి బంతిని లేపడం మా నాన్నకు ఇష్టం ఉండదు. బంతి గ్రౌండ్‌ను తాకేలా బ్యాటింగ్‌ చేయాలని సూచించేవారు. వరుస సిక్స్‌లు బాదేందుకు ఎటువంటి ప్రత్యేక వ్యూహాలు రచించలేదు. బంతులు నాకు అందడం..

వార్నర్ ఆసక్తికర ట్వీట్ ...!

ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు .

ఎంఎస్ ధోని కి మరో అరుదైన ఘనత...

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,మోస్ట్ సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని అంటే టక్కున గుర్తుకు వచ్చేది అతని కెప్టెన్సీలోనే భారత్‌ 2011లో వన్డే, 2007లో టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న విషయం . అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేలకుపైగా పరుగులు సాధించడం ..భారత తరపున 90 టెస్టు మ్యాచ్‌లాడాటం .

సంబంధిత వార్తలు