Technology

సెప్టెంబర్‌లో నోకియా 8 ..?

ఒకప్పుడు మొబైల్ రంగాన్ని శాసించిన నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నోకియా 5, 6 ఫోన్ల అమ్మకాలను ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. తాజాగా వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. లండన్‌లో జరిగిన ఒక   కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

ఐ ఫోన్ల పై బంపర్ ఆఫర్స్ ..

71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ సైట్లే కాదు, ఆఫ్‌లైన్ స్టోర్స్ వారు కూడా వినియోగదారులకు అనేక రకాల ఉత్పత్తులపై ఆఫర్లను అందజేస్తున్నారు. అయితే వాటిల్లో ముఖ్యంగా యాపిల్‌కు చెందిన పలు ఐఫోన్ మోడల్స్‌పై ఆఫర్లు కొంచెం ఎక్కువగానే లభిస్తున్నాయని చెప్పవచ్చు.

అనేక సైట్లతోపాటు రీటెయిల్ స్టోర్స్‌లోనూ పలు ఐఫోన్ మోడల్స్‌పై ప్రస్తుతం భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు నడుస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఐఫోన్ 7 (32 జీబీ) ను కొనుగోలు చేసే యూజర్లకు పేటీఎం రూ.9100 క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నది. 

రేప‌టి నుంచి మార్కెట్లోకి నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌..

హెచ్ఎండీ గ్లోబ‌ల్ సంస్థ త‌న 'నోకియా 5' స్మార్ట్‌ఫోన్‌ను గ‌తంలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ ఫోన్ యూజ‌ర్ల‌కు రేప‌టి నుంచి మార్కెట్‌లో ల‌భ్యం కానుంది. రూ.12,499 ధ‌ర‌కు ఈ ఫోన్‌ను యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. నోకియా 5 ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి ..

ఈ ఫోన్ గురించి తెలిస్తే ..వెంటనే బుక్ చేస్తారు ..?⁠⁠⁠⁠

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన యూల్‌ఫోన్ సంస్థ 'ఆర్మ‌ర్ 2' పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రూ.17,300 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 15వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. కాగా ఈ ఫోన్‌ను చాలా దృఢ‌మైన మెటీరియ‌ల్‌తో త‌యారు చేశారు. దీని వ‌ల్ల ఫోన్ అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. అంతేకాదు, నీటిలో ప‌డినా ఏమీ కాదు. లోప‌లికి నీరు పోదు. - 40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లలోనూ ఈ ఫోన్‌ను నిర‌భ్యంత‌రంగా ఉప‌యోగించుకోవ‌చ్చు.

20 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాతో స్మార్ట్ ఫోన్..

ఫేస్బుక్ ,ట్విట్టర్ ఇలా పలు సామాజిక మీడియాలలో ఫోటోలను పెట్టి తమ మిత్రులతో షేర్ చేసుకునే సెల్ఫీ ప్రియుల కోసం ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జియోనీ 20 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుద‌ల చేసింది.

జియోనీ ఏ1 లైట్ పేరుతో భార‌త మార్కెట్‌లో విడ‌ద‌లైన ఈ స్మార్ట్‌ఫోన్‌ 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ప‌నిచేస్తుంది. రూ.14,999కి ల‌భ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను రేప‌టి నుంచి భార‌త్‌లోని అన్ని రిటైల్‌ స్టోర్లలో పొంద‌వ‌చ్చు.

లేటెస్ట్ ఫీచర్లతో లెనోవో కె8 నోట్‌...

దేశంలోనే ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లెనోవో సరికొత్త మొబైల్‌ ఫోన్‌ను బుధవారం భారత విపణిలో విడుదల చేసింది. ఇప్పటికే ఆ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్లు విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంతో వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరతో లెనోవో ‘కె8 నోట్‌’ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధరను రూ.12,999గా నిర్ణయించింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మొబైల్‌ఫోన్లను ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు సంస్థ వెల్లడించింది.

అతితక్కువ ధరకే స్వైప్ ఎలైట్ వీఆర్ 4జీ ఫోన్..

ఎలైట్ వీఆర్ పేరిట స్వైప్ టెక్నాల‌జీస్ ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు  విడుదల చేసింది. రూ.4,499 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. షాప్‌క్లూస్ వెబ్‌సైట్ ద్వారా యూజ‌ర్లు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. స్వైప్ ఎలైట్ వీఆర్ ఫీచ‌ర్లు కింది విధంగా ఉన్నాయి .

 5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే,

1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,

2 జీబీ ర్యామ్‌,

8 జీబీ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,

డ్యుయ‌ల్ సిమ్‌,

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి.. మరో ఎలక్ట్రానిక్ క్లస్టర్

తెలంగాణ రాష్ట్రానికి మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ మంజూరైంది. ఇటీవలే రావిర్యాల ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌కు మంజూరు ఇచ్చిన కేంద్రం.. శుక్రవారం మరో క్లస్టర్‌కు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగర శివారు మహేశ్వరంలో ఏర్పాటుచేసే ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)కు అవసరమైన నిధులను ఇవ్వడానికి కేంద్ర ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన స్టీరింగ్ కమిటీ అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

గెలాక్సీ నోట్‌ 8 ఫీచర్లు అధిరిపోతున్నాయి ..

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ త్వరలో ‘గెలాక్సీ నోట్‌ 8’ను విడుదల చేయబోతోంది. ఈ మోడల్‌లోని ఫీచర్లు, డిజైన్‌ గురించి ఇప్పటికే అనేక రకాల వూహాగానాలు విన్పించాయి. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు బయటికొచ్చాయి. దీంతో పాటు ఫోన్‌ ఎలా ఉండబోతోందో కొన్ని ఫొటోలు కూడా విడుదలయ్యాయి. ఈ మొబైల్‌ వాటర్‌ ప్రూఫ్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌తో విడుదలవుతోందని తెలుస్తోంది.

మార్కెట్లోకి జియోనీ-ఏ1ప్లస్‌ స్మార్ట్ ఫోన్ ..

 చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తి సంస్థ జియోనీ తాను రూపొందించిన ‘జియోనీ-ఏ1ప్లస్‌’ అనే కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారతీయ విపణిలో దీని ధర రూ. 26,999గా నిర్ణయించింది. ఈ మొబైల్స్‌ రేపటి నుంచి అన్ని ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌లోనూ లభిస్తాయి.

సంబంధిత వార్తలు