Telangana

సీఎం కేసీఆర్‌పై బతుకమ్మ పాట

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌రావు, ఆయన ప్రజారంజకపాలనను సామాన్యులు బతుకమ్మ పాటలుగా మలుచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా తడకమడ్ల రూప అనే మహిళ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై పాడిన పాట అందరినీ ఆకట్టుకున్నది. ఆమె పాటకు మహిళలంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కేసీఆర్ పోరాటపటిమ, సర్కారు సంక్షేమపాలనపై కుమార్తెలు తడకమడ్ల ఉమ, తడకమడ్ల విజయ రాసిన ఉయ్యాల పాటను.. తల్లి రూప పాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
భరతదేశమందు ఉయ్యాలో.. ఓ రాజు పుట్టెను ఉయ్యాలో
ఆ రాజు పేరేమో ఉయ్యాలో.. చంద్రశేఖరుడంట ఉయ్యాలో

సూపర్‌ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయండి... ఎంపీ వినోద్‌

రెండో కౌన్సెలింగ్‌ తరువాత కూడా దేశవ్యాప్తంగా మిగిలిపోయిన సుమారు 500 సూపర్‌ స్పెషాలిటీ సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. వైద్యకోర్సుల్లో సీట్లు మిగిలిపోవడం మంచి పరిణామం కాదన్నారు.

సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్   తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని  కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ  శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని  సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు.

రేపు ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి చిరునామాగా నిలిచిన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నానికి సర్వం సిద్ధమవుతున్నది. మూడు ప్రపంచ రికార్డులకు హైదరాబాద్‌లోని లాల్‌బహద్దుర్ స్టేడియం ముస్తాబవుతున్నది. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సారథ్యంలో మంగళవారం జరిగే మహా బతుకమ్మ వేడుకకు తెరలేచింది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల నుంచి 40 వేల మంది ఆడబిడ్డలు ఈ సంబురంలో పాల్గొనేందుకు ఉవ్విళ్లురుతున్నారు. గతేడాది పదివేల మంది మహిళలతో నిర్వహించిన మహా బతుకమ్మ రికార్డును తిరుగరాసేందుకు అంతా రెడీ అవుతున్నది.

రేపు ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి చిరునామాగా నిలిచిన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నానికి సర్వం సిద్ధమవుతున్నది. మూడు ప్రపంచ రికార్డులకు హైదరాబాద్‌లోని లాల్‌బహద్దుర్ స్టేడియం ముస్తాబవుతున్నది. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సారథ్యంలో మంగళవారం జరిగే మహా బతుకమ్మ వేడుకకు తెరలేచింది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల నుంచి 40 వేల మంది ఆడబిడ్డలు ఈ సంబురంలో పాల్గొనేందుకు ఉవ్విళ్లురుతున్నారు. గతేడాది పదివేల మంది మహిళలతో నిర్వహించిన మహా బతుకమ్మ రికార్డును తిరుగరాసేందుకు అంతా రెడీ అవుతున్నది.

నేడు గవర్నర్ భూరికార్డుల పరిశీలన

భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గవర్నర్ నరసింహన్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఖరారు చేశారు. ఇందులోభాగంగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, భూమి రికార్డుల ప్రక్షాళన ప్రాజెక్టు మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం గురించి ఆయనకు వివరించారు. అనంతరం గవర్నర్ పర్యటించనున్న గ్రామాలపై చర్చించారు. 

స్వచ్ఛతలో సిరిసిల్ల నంబర్ వన్‌

స్వచ్ఛతలో రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలిచింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంతోపాటు చెత్తసేకరణ, బహిరంగ మలవిసర్జన రహిత విభాగాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర నీటి వనరులు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ స్వచ్ఛత దర్పన్ పేరిట ఆదివారం విడుదలచేసిన ప్రకటనలో ఈవిషయాన్ని వెల్లడించింది. వంద రోజుల వ్యవధిలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు చెత్త సేకరణ, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా.. పశ్చిమ బంగలోని హుగ్లీ, నదియా, ఛత్తీస్‌గఢ్‌లోని దహెమతరీ జిల్లాలతో కలిసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నెల 27న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవ కమిటీని నియమించింది. చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, వైస్ చైర్మన్లుగా ఎస్ దుర్గయ్యగౌడ్, సీఎస్ వెంకటరమణ, గోషిక యాదగిరి, ఈర్లపల్లి శంకర్, నీల వెంకటేశ్, నేతికార్ ప్రేమ్‌లాల్, సౌదరి భూమన్నయాదవ్, ఎం భాగ్యలక్ష్మి, టీ రామానుజం, ఎన్ విజయ్‌కుమార్, కన్వీనర్లు, కో- ఆర్డినేటర్లు, గౌరవ సలహాదారులుగా బీసీ వర్గానికి మరో 72 మందిని నియమించారు.

సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి ఇంకో భాషా ప్ర‌ముఖుడు ఫిధా

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు భాష సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణ‌యానికి మ‌రో ప్ర‌ముఖుడు ఫిదా అయ్యారు. తెలుగు బాషా విధానంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానానికి ధన్యవాదాలని ప్ర‌ముఖ సాహితివేత్త‌,ప‌ద్మ‌భూష‌ణ్‌ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్ర‌శంసించారు. సీఎం కేసీఆర్ చాలా విప్లవత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత హాజరయ్యారు. తోటి మహిళలతో కూడి బతుకమ్మలను పేర్చి అనంతరం ఆడిపాడారు. అదేవిధంగా గోషామహల్ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నార్త్‌జోన్ డీసీపీ సుమతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఐదవరోజు అట్ల బతుకమ్మ..

ఐదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు. ఈ రోజు పిండితో చేసిన అట్లను వాయనంగా ఇచ్చుకుంటారు.

సంబంధిత వార్తలు