Telangana

తెలంగాణ టీడీపీ తమ్ముళ్లకు బాబు పదవుల జాతర..

టీడీపీ  పొలిట్‌బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తయిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ   పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాకు కమిటీల  వివరాలు వెల్లడించారు. పార్టీ పోలిట్‌బ్యూరోలో 17 మంది సభ్యులు ఉంటారని ఆయన  స్పష్టం చేశారు. కొత్తగా తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించినట్టు చెప్పారు. ఇటీవల పార్టీని వీడి తెరాసలో చేరిన రమేశ్‌ రాఠోడ్‌ స్థానంలో సీతక్కను తీసుకున్నట్టు తెలిపారు.

ధనం కన్నా ఆరోగ్యం మిన్న..

తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు .దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనుల్లో భాగంగా జిల్లాలో పలు చోట్ల శంఖుస్థాపన కార్యక్రమాలకు హాజరయ్యారు .

తెలంగాణలో అంగన్ వాడి కేంద్రాలకు మహర్దశ ..

తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడి కేంద్రాలకు మహర్దశ వచ్చింది .ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అంగన్ వాడి కేంద్రాల్లో పని చేస్తోన్న ఆయాలకు ,అంగన్ వాడి టీచర్లకు జీతాలు పెంచడమే కాకుండా నిండు గర్భిణిలకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తోన్నారు .అంతే కాకుండా అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయడమే కాకుండా పలు వికాస కార్యక్రమాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది .అంతే కాకుండా పలు అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ..ఆధునీకరణ పద్దతుల్లో సరికొత్త భవనాలను నిర్మిస్తుంది .దీనిలో భాగంగా మంత్రి తుమ్మల జిల్లాలో బచ్చోడు గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు .ఈ

సంచార పశు వైద్యశాల అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభిన మంత్రి తుమ్మల ..

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు విద్య వైద్య రంగాల్లో పలు మార్పులను తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో వైద్య రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను మోడల్ ఆస్పత్రులుగా తయారుచేస్తుంది .దీనిలో భాగంగా పశు వైద్యాస్పత్రులను కూడా సర్కారు ఆధునికరిస్తుంది .రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాల అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది .ఆ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సంచార పశు వైద్యశాల అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభించారు .

ప్రతి ఆడబిడ్డ పండగక్కి కొత్త బట్టలతో బతుకమ్మ ఆడాలనే సీఎం ఆరాటం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్న ఎవరు కూడా తీసుకోలేని ..ఇప్పటివరకు ప్రకటించలేని నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి విదితమే .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగను అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హమీను నెరవేర్చే దిశగా సంబంధిత అధికారులు పగలు అనక రాత్రి అనక పని చేస్తోన్నారు .

కంచె ఐలయ్య కు మంత్రి హరీష్ రావు వార్నింగ్...

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రముఖ ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదం గురించి మాట్లాడుతూ ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైశ్యులపై ఐలయ్య రాసిన పుస్తకం సమంజసంగా లేదన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని తమ మనోభావాలను దెబ్బతిన్నాయని వైశ్యులు వినతిపత్రం ఇచ్చారని మంత్రి  తెలిపారు. తమ ప్రభుత్వం తరపున కూడా  ఐలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘ఒక కులాన్ని దూషించడం అనేది ఇది ఏ ఒక్కరికి తగదు. ఏ మేధావి కూడా ఐలయ్య వ్యాఖ్యలను, పుస్తకాలను ఆమోదించరు.

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారురు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహిళాభివృద్ధి సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, ప్రగతి భవన్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 

ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ బీజేపీ నేత ...

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్‌చార్జిగా పనిచేస్తున్న కొప్పోలు సత్యనారాయణ (58) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చీరాల రూరల్ లో  వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ సంపత్‌ నగర్‌లో జరిగింది.

మృతుడి సోదరుడు శివరామ కృష్ణయ్య పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సత్యనారాయణకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు కావడంతో ఒకరు హైదరాబాద్, మరొకరు బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.

మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నేతలు ...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు పట్టణంలో పర్యటించారు .ఈ సందర్భంగా త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోన్న సంఘాలను గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు .

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు . కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారుఐదోవ తేదీన జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటేసి.. టీబీజీకేఎస్‌ ను గెలిపించాలని కోరారు..ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు .వీరికి మంత్రి తుమ్మల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ..

మరో భారీ స్కెచ్ వేసిన సీఎం కేసీఆర్...

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ . తాజాగా వీటి తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి మరో భారీ మిషన్ రాబోతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ రూపు రేఖలు మార్చేలా లక్ష కోట్లతో మిషన్ హైదరాబాద్‌కు రూపకల్పన చేస్తున్నారు.మిషన్ కాకతీయ పేరుతో రూ. 25వేల కోట్లతో చెరువులు పునరుద్ధరణ చేపట్టారు. సుమారు రూ. 40 వేల కోట్లతో ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ కొనసాగుతోంది. ఇదే తరహాలో మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

సంబంధిత వార్తలు