Telangana

హుస్సేన్‌సాగర్‌లో ప్రళయ్‌ సహాయ్‌ మాక్‌ డ్రిల్‌

అద్భుత విన్యాసాల‌కు హుస్సేన్ సాగ‌ర్ వేదికైంది. సాగర్ లో 'ప్రళయ్ స‌హాయ్' పేరుతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వహించిన మాక్ డ్రిల్ విశేషంగా ఆకట్టుకుంది. భాగ్యనగరంలో భారీ వరద సంభవిస్తే.... మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలనే దానిపై సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. దీనికోసం హుస్సేన్ సాగర్ లో మునిగిపోయిన ఇళ్లు, భవనాలు, విద్యాసంస్థలు, వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాల్లో ప్రజలు చిక్కుకున్నట్లు కేకలు వేస్తూ కనిపించారు. వారిని సైనికులు స్పీడు బోట్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు.

టీఆర్ఎస్ లోకి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ..?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో బలంగా ఉన్న అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి పరుగులు పెట్టిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలతో సహా మాజీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కింది స్థాయి క్యాడర్ కారు ఎక్కుతున్న సంగతి విదితమే .తాజాగా ఒక వార్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది .

ఉగాది రోజే గృహప్రవేశాలు..

వచ్చే ఏడాది ఉగాది రోజున గజ్వేల్‌లో డబుల్‌ బెడ్‌ రూం గృహ ప్రవేశాలు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చేయిస్తామన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు . శుక్రవారం గజ్వేల్‌ పట్టణంలో ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’మోడల్‌ కాలనీ, పాండవుల చెరువు, వంద పడకల ఆస్పత్రి పనులను పరిశీలించారు ఆయన. పశువైద్యం కోసం ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను ప్రారంభించి, ములుగులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 1256 ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 650 ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తుండగా, మరో 600కు పైగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.

వృద్ధురాలికి కేటీఆర్ అండ

సమయమేదైనా.. సమస్యను ఎవరుచెప్పినా వెంటనే స్పందిస్తారు ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు. నడిరోడ్డుపై చలిలో వణుకుతున్న వృద్ధురాలి గురించి వచ్చిన ట్వీట్‌కు వెంటనే స్పందించి, అండగా నిలిచారు. కాప్రా సర్కిల్ పరిధిలోని రాధిక చౌరస్తా సమీపంలోని హెల్మెట్ వరల్డ్ వద్ద గురువారం అర్ధరాత్రి 12 గంటలకు చలికి వణుకుతూ ఓ వృద్ధురాలు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నది. 

కాంగ్రెస్ కు ఎదురుతిరిగిన సింగరేణి కార్మికులు

విపక్షాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇన్నాళ్లుగా అంతర్గంతంగా ఉన్న కుమ్ములాటలు కాస్త బహిర్గతం అయ్యాయి. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీతో కలిసి కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ పొత్తుపెట్టుకోవడం గొడవకు దారి తీసింది. ఐఎన్‌టీయూసీ నిర్ణయాన్ని కార్మికులు తీవ్ర స్థాయిలో ఖండించారు. కాంగ్రెస్‌ పెద్దల ముందే నిరసన గళం విప్పారు.

సీఎం కేసీఆర్ హర్షం...

గొల్లకురుమల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు లక్షా 860 మందికి 21,18,060 గొర్రెలు పంపిణీ చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. తక్కువ వ్యవధిలో లక్ష యూనిట్లకు పైగా పంపిణీ చేయడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది హరితహారం కోసం ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పడే గ్రామపంచాయితీలను కలుపుకుని 10 వేల గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు.

కొత్త రికార్డుల ఆధారంగానే పెట్టుబడి..సీఎం కేసీఆర్

 సవరించిన రికార్డుల ఆధారంగానే సాగుకు పెట్టుబడి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెవెన్యూ అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం ఇవాళ సమావేశమయ్యారు. భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూ రికార్డుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వస్తున్నందున రైతులకు ఊరట కల్గుతోందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో పాల్గొంటున్న సిబ్బందికి నగదు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు.

గురుకులాల మెయిన్స్ ఫలితాలు విడుదల⁠⁠⁠⁠..

తెలంగాణ రాష్ట్రంలోని  ఇటీవల జరిగిన పీజీటీ తెలుగు, ఉర్దూ భాషా పండితుల పోస్టుల ప్రధాన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నెల 26న మాసబ్‌ ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించినున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

సింగరేణి లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన...

తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థలో  750 ఉద్యోగాల భర్తీకి ప్రకటన రేపు శనివారం వెలువడనుంది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లలో 5,793 ఉద్యోగాలను భర్తీ చేసిన సింగరేణి సంస్థ.. తాజాగా 750 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో కార్మిక శ్రేణి ఉద్యోగాలు 643 .. అధికారుల శ్రేణి ఉద్యోగాలు 107 ఉన్నాయి. ఆయా పోస్టులు, వాటికి సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర వివరాలు www.scclmines.com వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్   ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలియజేసారు . ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 22.008 శాతం నుంచి 24.104 శాతానికి డీఏను పెంచింది. పెంచిన డీఏ 2017 జనవరి 1 నుంచి వర్తించనుంది. సెప్టెంబర్ నెల వేతనంతో పెరిగిన కరువు భత్యం ఇవ్వనున్నారు. మిగతా నెలల డీఏ జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం కలపనుంది. డీఏ పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు