Telangana

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత

నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు ఆర్మూర్ నియోజకవర్గం వెల్మాల్ గ్రామంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక మహిళలు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. తోటి మహిళలతో కలిసి కవిత బతుకమ్మలను పేర్చారు.

బాహుబలి పై జక్కన్న సంచలన నిర్ణయం .....

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన 'బాహుబలి 2' అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది.

వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ రాష్టంలో  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం  కేసీఆర్ రాజకీయంగా  కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట  రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

సీసీ కెమెరాలను ప్రారంబించిన హోంమంత్రి నాయిని

హైదరాబాద్  నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ..  సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ కెమెరాలకు అధికంగా నిధులు ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ఉగ్రవాదం, నక్సలిజం అరికట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు.

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రామోజీరావు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు  ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు రామోజీరావు అభినందనలు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని లేఖలో రామోజీరావు పేర్కొన్నారు. 

టీఎస్ సెట్ ఫలితాలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్) ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫలితాల విడుదలపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన టీఎస్ సెట్ లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో పరీక్ష ఫలితాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. మరోసారి విచారించిన హైకోర్టు.. ఫలితాల విడుదలపై ఉన్న స్టేను ఎత్తివేసింది. ఆ ఫలితాల విడుదలకు ఉన్న అడ్డంకి తొలిగిపోయింది. దీంతో త్వరలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

టీబీజీకేఎస్ ను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తాం..

సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. 15 వేలకు పైగా ఉద్యోగులు సభ్యులుగా ఉన్న అసోసియేషన్ టీబీజీకేఎస్ కు మద్దతు ప్రకటించింది. తెలంగాణ భవన్ లో అసోసియేషన్ అధ్యక్షుడు బిరుదు రాజేశ్, జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవితను కలిసి తమ సమస్యల గురించి గంటకు పైగా చర్చించామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని రాజేశ్ చెప్పారు.

ఆదర్శంగా నిలిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పేదవర్గాలకు చెందిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మొదలెట్టిన సంగతి తెలిసిందే .గత నాలుగు రోజులుగా ఐదు వందల డిజైన్లతో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మహోత్తర కార్యానికి కేసీఆర్ సర్కారు పూనుకుంది ఐతే ప్రతిపక్షాలు కొంత మంది  మహిళలను రెచ్చగొట్టి... కావాలని వారు తీసుకున్న చీరలు తగలబెట్టించారు.తర్వాత ఆ కుట్రను గ్రహించిన ప్రజలు దాన్ని తిప్పికొట్టారు .. చీరలు క్వాలీటీ లేవు వీటిని ఎవరు కట్టుకుంటారు అని ప్రతిపక్షాలు డ్రామాలాడాయి.

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కుట్రలు చేస్తోంది ఎవరు ...?

తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయగా మారిన సింగరేణిలో అక్టోబర్ 5న ఆరోసారి యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను రాజకీయపార్టీలు మొత్తంగా రాజకీయం చేసేశాయి. ప్రస్తుత గుర్తింపుసంఘం గా ఉన్న టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే మొత్తం ప్రభుత్వమే ఓడిపోయినట్టేనని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైసీపీ లాంటి ప్రతిపక్షపార్టీలు భావిస్తున్నాయి. వాస్తవానికి యూనియన్ గుర్తింపు ఎన్నికలకు, రాజకీయపార్టీలకు సంబంధమే లేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌కు కార్మికులు పూర్తిగా అండగా నిలబడ్డారు. ఆయనపట్ల అమితమైన గౌరవం, ప్రేమ, అభిమానం కార్మికులకు ఉన్నది.

సంబంధిత వార్తలు