Telangana

సంచార పశువైద్యశాల అంబులెన్సును ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోన్న సంగతి తెలిసిందే .రాష్ట్రంలో ఒకప్పుడు సర్కారు ఆస్పత్రులు అంటే భయపడే స్థాయి నుండి అసలు ఆస్పత్రులలో బెడ్స్ దొరికే స్థాయి వరకు ప్రభుత్వం ఆస్పత్రులను అభివృద్ధి చేస్తోంది .

విద్యార్ధులకు విద్యతో పాటు క్రీడలు కూడా అవసరం ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలో సర్కారు విద్యకు పెద్ద పీట వేసింది .ఈ క్రమంలో రాష్ట్రంలో పలు వర్గాల వారికీ గురుకులాల పేరిట పాఠశాలలు నిర్మిస్తూ సర్కారు బడుల్లోకి విద్యార్ధుల హాజరు శాతం పెంచే ప్రయత్నాలు చేస్తోంది .అంతే కాకుండా గురుకులాల్లో చదివే విద్యార్ధులకు మెస్ చార్జీలు పెంచడమే కాకుండా ప్రైవేటు బడులలో ఉండే సదుపాయాలను కల్పిస్తుంది .దీంతో సర్కారు బడులలో చదివే విద్యార్ధుల సంఖ్య గతంలో ఎన్నడు లేని విధంగా గణనీయంగా పెరిగింది .

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన కైలాస్ సత్యార్థి

నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి తెలంగాణ అసెంబ్లీని ఈ రోజు  సందర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న కైలాస్ సత్యార్థికి శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన నివాళి అర్పించారు. భారతయాత్రలో భాగంగా కైలాస్ సత్యార్థి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీష్‌రెడ్డి, ఎంపీలు వినోద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ దసరా కానుక..సంబురాల్లో సింగరేణి కార్మికులు..!

cm kcr dasara  gift to singareni workers...!

తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్క బతుకమ్మ పండుగ, దేవీ నవరాత్రులు మొదలయ్యాయి. ఆ వెంటనే  దసరా, దీపావళి పండుగలు సందడి చేయబోతున్న తరుణంలో సింగరేణి కార్మికుల జీవితాల్లో మరోసారి సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం  దసరా అడ్వాన్స్ ,  దీపావళి బోనస్ కింద  ఒక్కో కార్మికుడికి రూ. 82 వేల భారీ నజరానా ప్రకటించింది. దీంతో సింగరేణి కాలరీస్‌ వ్యాప్తంగా వేలాది కార్మికుల కుటుంబాలకు దసరా పండుగ ముందే వచ్చినట్లయింది. సింగరేణి కాలరీస్‌లో కార్మికులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్... మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ అని మంత్రి కేటీఆర్ అన్నారు . పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు.ఈ రోజు  హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో కార్మిక భద్రత - ఆరోగ్యం, పారిశ్రామిక అభివృద్ధి అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. అనంతరం  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ....

కాళేశ్వరం ప్రమాద బాధితులకు అండగా ప్రభుత్వం ..

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామం దగ్గర నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని 10 వ ప్యాకేజీ పంపు హౌజ్ డ్రాఫ్ట్ ట్యూబ్ పైకప్పు కూలిన ఘటన పై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సంఘటనలో మొత్తం ఏడుగురు మరణించినట్టు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనంద్ ఘటనా స్థలం నుంచి సమాచారమందించారని మంత్రి హరీష్ తెలిపారు ఈ సంఘటనపై మంత్రి హరీశ్ రావు సమగ్ర విచారణకు ఆదేశించారు.

మంత్రి కేటీఆర్ కృషి... దేశంలో మూడో స్థానంలో తెలంగాణ

డిజిటల్ చెల్లింపు విషయంలో తెలంగాణ ముందుకు దూసుకపోతుంది. 224 రకాల ప్రభుత్వ సేవల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. 2017 జనవరి 1 నుంచి ఆగస్టు31 వరకు జరిగిన లావాదేవీల వివరాల ప్రకారం నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది. డిజిటల్ చెల్లింపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో డిజిటల్ విధానం పకడ్బందీగా అమలు జరగడానికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కృషి ప్రశంసనీయం.

ఖమ్మం ,భద్రాది -కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం ,భద్రాది -కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ రెండు జిల్లాలలో ప్రతిపక్ష పార్టీలు అనేవి లేకుండా చేస్తోన్నారు .ఈ క్రమంలోనే రెండు జిల్లాలలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి వస్తోన్నారు .

బంగ్లాదేశ్‌ అమ్మాయిలతో హైదరాబాద్‌లో వ్యభిచారం

జంట నగరాల్లో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతున్నది. ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. బంగ్లాదేశ్‌ యువతితో హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. నూకరాజు అలియాస్‌ బొంబాయి రాజు, మహ్మద్‌ ముస్తఫాను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. మేడిపల్లికి చెందిన రాజు.. అతడి స్నేహితుడు బహదూర్‌పురాలో ఉండే ముస్తఫా, మరొక మహిళ నందినితో కలిసి వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నాడు. వీరంతా దేశంలోని ఇతర నగరాల నుంచి యువతులను తీసుకువచ్చి ఈ దందా చేస్తున్నారు.

చీరలతో చిల్లర రాజకీయాలా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం చేయడం పద్ధతి కాదు. మరణశయ్య మీదున్న సిరిసిల్ల మరమగ్గాన్ని ఈసారి బతుకమ్మ బతికించింది. తిండి, కరువు, బతుకు, బరువుతో చేజారిన చేనేత జీవితాన్ని చీర చేరదీసింది.

సంబంధిత వార్తలు