Telangana

టీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు ...!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు .

ఈ క్రమంలో గోపాల్ పేట మండలంలో బుద్ధారం ,తండాలు ,పోల్కేపహాడ్ గ్రామాలకు చెందిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ,కార్యకర్తలు భారీ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .పార్టీలో చేరినవారికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు .

మహిళ రైతుకు అండగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేద మహిళ రైతుకు అండగా నిలిచారు .ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో ఈ నెల 12వ తారీఖున రైతు సమన్వయ సమితి కమిటీలలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

ఆ రోజు మండల కేంద్రానికి చెందిన బైని చెన్నమ్మ భర్త చనిపోయి కుటుంబ పోషణ భారమైన తనకున్న పొలంలోనే పంట సాగుచేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఇబ్బంది పడుతున్న తీరును తెలుసుకున్న నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ఆమెకు తనవంతు సహాయం చేస్తానను అని హామీ ఇచ్చారు .ఇచ్చిన హామీ ప్రకారం నిన్న బుధవారం వనపర్తిలోని తన నివాసంలో మహిళ రైతుకు రూ .25ల వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు .

" బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న యూఎస్ కాన్సుల్ జనరల్ "

 తెలంగాణ సాంప్రదాయమంటే తనకెంతో ఇష్టమని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న కేథరిన్ బి. హడ్డా అన్నారు. తోటి మహిళలతో కలిసి ఆమె నేడు బతుకమ్మ వేడుకలో పాల్గొని ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె తన స్పందనను తెలియజేస్తూ..తెలంగాణ సాంప్రదాయమంటే నాకు ఏంతో ఇష్టం. తెలంగాణ సంస్కృతిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ప్రకృతిని, మహిళలను గౌరవించే బతుకమ్మ పండుగ అంటే నాకు ఏంతో ఇష్టం అని  అన్నారు. 

కాళేశ్వరం ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా  ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామం దగ్గర నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీ పనుల్లో ఈ రోజు    జరిగిన ప్రమాదంపై సీఎం  కేసీఆర్‌.మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం  కేసీఆర్‌ సూచించారు. .ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్‌రావు విచారణకు ఆదేశించారు మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే మంత్రి హరీశ్ రావు జలసౌధ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

విమానాల్లో మ‌న బ‌తుక‌మ్మ మాట‌..పాట‌

తెలంగాణ ప్ర‌జ‌ల సంస్కృతి విశిష్ట చిహ్న‌మైన బ‌తుక‌మ్మ ఖ్యాతి మ‌రింత విశ్వ‌వ్యాప్తం కానుంది. విమానాల్లో బతుకమ్మ మాట వినిపించ‌నుంది. విమానాశ్రయాల్లో మహిళా ప్రయాణికులకు బతుకమ్మ బ్రోచర్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇండిగో, జెట్‌, స్పైస్‌ జెట్‌తో పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకున‌ట‌న్లు తెలిపారు. 

 

మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి ప్రత్యేక ఆహ్వానం...

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు ప‌నితీరుకు మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు ద‌క్కింది. వినూత్న విధానాల‌తో ముందుకు సాగుతున్న మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి నుంచి ప్ర‌త్యేక ఆహ్వానం ద‌క్కింది. మెదటిసారి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ మొబైల్ కాంగ్రెస్ లో ప్రసంగించాలని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2017 సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

బతుకమ్మ చీరలపై తెలంగాణ ప్రతిపక్షాలకు ఎన్నారైలు అదిరిపోయే కౌంటర్

లండన్ - పేదింటి సారె బతుకమ్మ చీరెలపైన ప్రతిపక్షాలు చేస్తున్న అమానవీయ చిల్లర రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు శ్రీ అనిల్ కూర్మాచలం , ఉపాధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి , కార్యదర్శి & అధికార ప్రతినిధి శ్రీ చాడ సృజన రెడ్డి  పత్రిక ప్రకటనలో తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీ వెనక అసలు కారణం ఇదే ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ పండగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మలక్ పెట్ నియోజకవర్గంలోని షోయబ్ పార్క్,మూసరంబగ్ లోని సిరిపురం కమ్యూనిటీ హాల్ లో స్థానిక మహిళలకు చీరల పంపణి కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు.

ప్రతిపక్షాలకు బ్యాడ్ న్యూస్ ... తెలంగాణ సర్కార్ కు గుడ్ న్యూస్‌

తెలంగాణలో ఏ అభివృద్ధి కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైనా వెంట‌నే ప్ర‌జ‌ల్లో ఆనందం క‌నిపిస్తుంది. అయితే అంత‌కంటే ముందే కుట్ర‌ల బ్యాచ్‌గా పేరొందిన కొంద‌రిలో ఎలా అడ్డుప‌డాలి అనే ఆకాంక్ష ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభ‌మైన త‌ర్వాత వారు కోర్టును ఆశ్ర‌యించి స్టేలు తెస్తూ...ప్ర‌భుత్వం ఏమీ  చేయ‌డం లేదంటూ గ‌గ్గోలు పెడుతుంటారు. అలా గ‌గ్గోలు పెట్టే కుట్రల బ్యాచ్‌లోని ఒక విభాగానికి తాజాగా కోర్టు సాక్షిగా షాక్ త‌గిలింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విన‌తికి అంగీక‌రిస్తున్న‌ట్లు కేంద్రం ఓకే చేసింది.

 

సంబంధిత వార్తలు