AP politics

చంద్ర‌బాబు స‌ర్కార్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!   

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద‌రాబాదుకి వ‌చ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో ప‌వ‌న్‌కి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుని, డీసీఐ సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని అన్నారు.

మంత్రి కామినేని పై నిప్పులు చెరుగుతున్న‌ టీడీపీ ఎమ్మెల్యేలు..! 

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఇచ్చిన జీవో నెంబరు 418 పై ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పై మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది. వెంటనే డయాలసిస్ సెంటర్లను అక్కడ ఏర్పాటు చేశారు. పలాస, సోంపేటల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్సకు కొంత వరకూ సహకారాన్ని అందించారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్ కే వెళ్లిపోయిందని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ శివాజీ, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ కుమార్ లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ రాజ‌కీయ సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్.. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో లోకేష్‌..!

బాహుబ‌లి సిరీస్ చిత్రాల‌తో రాజ‌మౌళ‌  ఎవరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదిగితే టీడీపీ అధినేత చంద్ర‌బాబు పుణ్య‌మా అని జ‌క్క‌న్న ఇమేజ్ అదోఃపాతాళానికి ప‌డిపోయేలా ఉంది. రాజమౌళి మీద మీకు అంత ప్రేమాభిమానాలుంటే, రాజమౌళి విజన్‌ మీద మీకంత నమ్మకం వుంటే రాజమౌళి దర్శకత్వంలో లోకేష్‌ హీరోగా సినిమా నిర్మించుకోండి.. లేదంటే, మీ బావమరిది బాలకృష్ణని హీరోగా పెట్టి రాజమౌళితో సినిమా చేయించుకోండి. అంతేగానీ, రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాజమౌళి సలహాలు తీసుకోవడమేంటని..  వైసీపీ నేత అంబటి రాంబాబు మండి ప‌డ్డారు.

చంద్రబాబుకు ఊహించ‌ని షాక్‌ .. టీడీపీ స‌ర్కార్ పై ఎదురు దాడికి దిగిన‌ రాయపాటి సంస్థ..!

ఏపీలో పోలవరం నిర్మాణ పనుల జాప్యానికి కారణం చెప్పాలని ఏపీ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేయడంతో ట్రాన్స్‌ట్రాయ్‌ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే తాము సకాలంలో పనులు చేయలేకపోయామని ట్రాన్స్‌ట్రాయ్‌ ఎదురుదాడికి దిగింది. తమను పనుల నుంచి తప్పించడంలో అర్ధం లేదని., సంస్థ ఆర్ధిక ఒడిదుడుకుల్లో ఉన్నా పనులు ఎప్పుడు ఆపలేదని స్పష్టం చేసింది.  ట్రాన్స్‌ట్రాయ్‌ ఇచ్చిన 22పేజీల వివరణలో ప్రభుత్వం తమకు సకాలంలో భూమిని అప్పగించలేదని., డిజైన్లు ఖరారు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

2019లో గుడివాడను వదిలేస్తా.. కొడాలి నాని సంచ‌ల‌నం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై  తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో న‌న్ను ఓడిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డంతో పాటు గుడివాడ వ‌దిలి వెళ్ళేందుకు తాను సిద్ధ‌మ‌ని ద‌మ్మున్న‌ స‌వాల్ విసిరారు. ద‌మ్మున్న టీడీపీ నేత‌లు ఎవ‌రైనా ఉంటే ఈ స‌వాల్‌ని స్వీక‌రించాల‌ని కొడాలి నాని అన్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో హాట్ టాపిక్‌.. డిశ్చార్జి పిటిషన్ వేసిన జ‌గ‌న్..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత‌  తనపై నమోదైనవి అసంబద్ధమైన కేసులు అని, వాటి చార్జిషీట్స్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ దాఖ‌లు చేసిన‌ డిశ్చార్జి పిటిషన్ ఆసక్తికరంగా మారింది. ఈ కేసు విచారణ నుంచి తన పేరును తొలగించాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలు సార్లు విచారణ జరిగింది. జగన్ మోసం చేసి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నాడు అని సీబీఐ వాదించింది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు మాత్రం అలాంటిది ఏమీ లేదని అంటున్నారు. పెట్టుబడి పెట్టిన వారెవరూ జగన్ పై ఆ ఫిర్యాదులు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు.

చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌కి స్ట‌న్నింగ్ షాక్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ఏపీ రాజ‌కీయాల్లో సంచలనాలకి మారు పేరు అయిన జేసీ దివాక‌ర్ రెడ్డి  ముక్కు సూటిగా మాట్లాడే తత్వం..ప్రతిపక్షానికి అయినా, స్వపక్షానికి అయినా అప్పుడప్పుడు చురకలు అంటించడం జేసీ నైజం. ఎప్పుడు సంచలన నిర్ణయాలని తీసుకునే జేసి దివాకర్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అంద‌రికీ ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే జేసీ స్టేట్‌మెంట్‌తో త‌ల ప‌ట్టుకున్న చంద్ర‌బాబు బ్యాచ్‌కి మ‌రో షాక్ ఇచ్చారు జేసీ. జేసీని ఎలైగైనా బుజ్జ‌గించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు టీడీపీ నేత‌లు. అయితే  త‌న‌ రాజీనామాపై వెనక్కు తగ్గడం లేదు ఈ టీడీపీ ఎంపీ.  

ఏపీలో టీడీపీ బ్యాచ్‌కి మ‌రో షాక్‌.. వైసీపీ శ్రేణులు సైతం ఉంహిచి ఉండ‌రు..! 

ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్‌ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత  జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలతో  జగన్ నిర్వహించిన సమీక్షలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు పై సమీక్ష జరిపారు. 

చంద్ర‌బాబుకు బ్లాస్టింగ్ షాక్‌.. టీడీపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ల‌గ‌డ‌పాటి లేటెస్ట్ స‌ర్వే..!

ఏపీ ఆక్టోప‌స్‌గా పిల‌వ‌బ‌డే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. 2014కు ముందు ఉమ్మ‌డి ఏపీ కోసం ఆయ‌న చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతాకాదు. ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర అల్లుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. అతి త‌క్కువ కాలంలోనే ఆయ‌న త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఉన్న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలోనే అయినా.. ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ ల‌గ‌డ‌పాటికి ప్ర‌త్యేక డ‌యాస్ ఉందంటే.. ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అయితే అనూహ్య ప‌రిస్థితుల‌లో ఏపీ విభ‌జ‌న జ‌ర‌గ‌డం, చెప్పిన ప్ర‌కారం ల‌గ‌డ‌పాటి పాలిటిక్స్‌కు దూరం జ‌ర‌గ‌డం జ‌రిగిపోయాయి. 

చంద్ర‌బాబు సర్కార్‌ని చావు దెబ్బ కొట్ట‌న వైసీపీ..!

సదావర్తి భూముల వేలం విషయంలో ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా అమ్ముతుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా సుప్రీం హెచ్చరించింది. తొలిసారి జరిపిన వేలానికి, రెండోసారి జరిపిన వేలానికి మధ్య 40 కోట్లు తేడా రావడంపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకిలా జరిగిందని ప్రశ్నించారు. ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తి కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదని, రెండో బిడ్డర్‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం వరకు సమయం ఉందని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వివరించింది.

సంబంధిత వార్తలు