tdp

లోకేష్ ను మించిన జవహర్ ..

nara lokesh,javahar,andhrapradesh,tdp,ysrcp,ys jaganmohan reddy

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఉంది ఏపీ అధికార పార్టీకి చెందిన నేతల ..మంత్రుల తీరు .ఈ క్రమంలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ఒకర్ని మించి ఒకరు నోరు జారుతూ మాటల మీద మాటలు పలుకుతున్నారు .చాలా రోజుల తర్వాత అధికారం దక్కిందని సంబరమో ..లేదా వారికి విషయాల మీద పరిజ్ఞానం లేదో కానీ మీడియా కనపడితే ..మైక్ కనపడితే చాలు మాటలు జారుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు .

12మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాదు .ఒక్క మాజీ ఎమ్మెల్యే కోసమే బాబు ఆరాటం ..!

andhrapradesh,tdp,ysrcp,gurunath reddy,chandhrababu,ys jaganmohan reddy

నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు అని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు చేసే ప్రధాన ఆరోపణ.ఆయన రాజకీయ జీవితంలో ఏనాడూ సత్యం పలకని వాడు ..ఇతర పార్టీలకు చెందిన నేతలను భయపెట్టో ..బెదిరించో ..తాయిలాలు ప్రకటించో తమ పార్టీలోకి చేర్చుకుంటాడు అని వైసీపీ నేతలు బాబు అండ్ బ్యాచ్ మీద ఆరోపణల వర్షం కురిపిస్తుంటారు .

టీడీపీలో సంక్షోభం -టీడీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై ...!

andhrapradesh, tdp, ysrcp, magunta srinivasareddy,ys jaganmohan reddy,chandhrababu

ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి .గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలను ,ఎంపీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి .ఈ క్రమంలోనే టీడీపీ పార్టీకి చెందిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ లు ,మాజీ మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు .

మంత్రి కామినేని పై నిప్పులు చెరుగుతున్న‌ టీడీపీ ఎమ్మెల్యేలు..! 

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఇచ్చిన జీవో నెంబరు 418 పై ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పై మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది. వెంటనే డయాలసిస్ సెంటర్లను అక్కడ ఏర్పాటు చేశారు. పలాస, సోంపేటల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్సకు కొంత వరకూ సహకారాన్ని అందించారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్ కే వెళ్లిపోయిందని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ శివాజీ, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ కుమార్ లు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఊహించ‌ని షాక్‌ .. టీడీపీ స‌ర్కార్ పై ఎదురు దాడికి దిగిన‌ రాయపాటి సంస్థ..!

ఏపీలో పోలవరం నిర్మాణ పనుల జాప్యానికి కారణం చెప్పాలని ఏపీ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేయడంతో ట్రాన్స్‌ట్రాయ్‌ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే తాము సకాలంలో పనులు చేయలేకపోయామని ట్రాన్స్‌ట్రాయ్‌ ఎదురుదాడికి దిగింది. తమను పనుల నుంచి తప్పించడంలో అర్ధం లేదని., సంస్థ ఆర్ధిక ఒడిదుడుకుల్లో ఉన్నా పనులు ఎప్పుడు ఆపలేదని స్పష్టం చేసింది.  ట్రాన్స్‌ట్రాయ్‌ ఇచ్చిన 22పేజీల వివరణలో ప్రభుత్వం తమకు సకాలంలో భూమిని అప్పగించలేదని., డిజైన్లు ఖరారు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

2019లో గుడివాడను వదిలేస్తా.. కొడాలి నాని సంచ‌ల‌నం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై  తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో న‌న్ను ఓడిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డంతో పాటు గుడివాడ వ‌దిలి వెళ్ళేందుకు తాను సిద్ధ‌మ‌ని ద‌మ్మున్న‌ స‌వాల్ విసిరారు. ద‌మ్మున్న టీడీపీ నేత‌లు ఎవ‌రైనా ఉంటే ఈ స‌వాల్‌ని స్వీక‌రించాల‌ని కొడాలి నాని అన్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలో టీడీపీ బ్యాచ్‌కి మ‌రో షాక్‌.. వైసీపీ శ్రేణులు సైతం ఉంహిచి ఉండ‌రు..! 

ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్‌ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత  జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలతో  జగన్ నిర్వహించిన సమీక్షలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు పై సమీక్ష జరిపారు. 

వైసీపీలోకి టీడీపీ యువ ఎమ్మెల్యే ...?

andhrapradesh,tdp,ysrcp,kodali nani,vallabhaneni vamshi,vijayawada

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్రబిందువు అయ్యాయి .ఈ క్రమంలోదివంగత మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ లో ఎక్కడ లేని తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది .

చంద్ర‌బాబుకు బ్లాస్టింగ్ షాక్‌.. టీడీపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ల‌గ‌డ‌పాటి లేటెస్ట్ స‌ర్వే..!

ఏపీ ఆక్టోప‌స్‌గా పిల‌వ‌బ‌డే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. 2014కు ముందు ఉమ్మ‌డి ఏపీ కోసం ఆయ‌న చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతాకాదు. ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర అల్లుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. అతి త‌క్కువ కాలంలోనే ఆయ‌న త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఉన్న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలోనే అయినా.. ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ ల‌గ‌డ‌పాటికి ప్ర‌త్యేక డ‌యాస్ ఉందంటే.. ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అయితే అనూహ్య ప‌రిస్థితుల‌లో ఏపీ విభ‌జ‌న జ‌ర‌గ‌డం, చెప్పిన ప్ర‌కారం ల‌గ‌డ‌పాటి పాలిటిక్స్‌కు దూరం జ‌ర‌గ‌డం జ‌రిగిపోయాయి. 

చంద్ర‌బాబు సర్కార్‌ని చావు దెబ్బ కొట్ట‌న వైసీపీ..!

సదావర్తి భూముల వేలం విషయంలో ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా అమ్ముతుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా సుప్రీం హెచ్చరించింది. తొలిసారి జరిపిన వేలానికి, రెండోసారి జరిపిన వేలానికి మధ్య 40 కోట్లు తేడా రావడంపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకిలా జరిగిందని ప్రశ్నించారు. ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తి కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదని, రెండో బిడ్డర్‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం వరకు సమయం ఉందని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వివరించింది.

సంబంధిత వార్తలు