కొత్త పుంతలు తొక్కుతున్న ఆదిలాబాద్ గాయత్రి జలపాతం అందాలు

తెలంగాణ లో ఆదిలాబాద్‌ జిల్లా అంటేనే అడవులకు పుట్టినిల్లు అన్న సంగతి తెలిసిందే .అటువంటి జిల్లా మారుమూల అటవీప్రాంతలో జాలువారుతోంది ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం.దానికి సమీపంలోనే దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన శిలల నుంచి 200 అడుగుల లోయలోకి పాలనురగల పరవళ్లతో దూకుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతం.తెలంగాణలో  భూతల స్వర్గంగా అందమైన అడవిలో ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది.ఎంతో సహజసిద్ధంగా ఏర్పడిన వాగులు, కొండకోనల్లో నుంచి బజార్‌ హత్పూర్‌, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల అటవీ ప్రాంతాల గుట్టలపై నుంచి ప్రవహస్తున్న నీరు గ్రాయత్రిగా రాతి శిలలపై నుంచి పారుతోంది.ఇటీవల కురిసిన వర్షాలతో గాయత్రి జలపాతం కొత్త సొబగులు అద్దుకోవడంతో  దీనిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు తరలివస్తున్నారు.

సంబంధిత వార్తలు