Andhrapradesh

పీఎస్ లో బైఠాయించిన ఎంపీ.. స్వచ్ఛందంగా రోడ్లపై ఆందోళనకు దిగిన వేలాదిమంది.. 

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ కార్యకర్తలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడికి దిగడంతో చేయడంతో పట్టణంలో వివాదం రాజుకుంది.. తెలుగుదేశం కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సోమవారం ఉదయం ఈ వివాదం చెలరేగింది.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు వచ్చి వైసీపీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్‌ దివ్య, ఆమె తండ్రి ఎరికలరెడ్డిని వెంట తీసుకుని వెళుతుండగా దివ్యను ప్రజలు నిలదీశారు.

వైఎస్ హయాంలో కాపు నాయకుల పరిస్థితి ఎలా ఉండేది.?

కన్నా లక్ష్మీనారాయణ, దాసరి నారాయణ రావు, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత కుమార్, జక్కంపూడి రామ్మోహన్ రావు, పళ్లం రాజు, సాయి ప్రతాప్ , దానం నాగేందర్, మండలి బుద్ద ప్రసాద్, సామినేని ఉదయబాను, వల్లభనేని బాలసౌరి వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పదవుల్లో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమకంటూ ప్రత్యేకంగా పేరు ప్రతిష్టలు, గౌరవమర్యాదలు, కీర్తి సంపాదించుకున్న కాపు సామజికవర్గానికి చెందిన నేతలు. వీళ్లే కాకుండా అనేకమంది జిల్లాల్లో నేతలు వైఎస్ అండతో ఎదిగారు.. అలాగే కేవీపీ రామచంద్రరావుతో పాటు వైఎస్ కు ప్రాణ స్నేహితులెవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉంటారు..

కాపుల‌కు ఒక కాపు స్టూడెంట్ ఒక సందేశం..

కన్నా లక్ష్మీనారాయణ గారు
దాసరి నారాయణ రావు గారు
బొత్సా సత్యనారాయణ గారు
వట్టి వసంత కుమార్ గారు
జక్కంపూడి రామ్మోహన్ రావు గారు
పళ్లం రాజు గారు
సాయి ప్రతాప్ గారు
దానం నాగేందర్ గారు
మండలి బుద్ద ప్రసాద్ గారు
సామినేని ఉదయబాను గారు
వల్లభనేని బాలసౌరి గారు....

చంద్రబాబును నిద్రపోనివ్వనంటున్న మాజీమంత్రి.. 

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి చంద్రబాబుపై ఆగ్రహించారు.. పార్టీలను పక్కకుపెట్టి కాపులందరం ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్‌ సాధించేవరకు కాపు జాతి నిద్ర పోకూడదని, చంద్రబాబును నిద్రపోనివ్వొద్దని, ఈ ఉద్యమంలో చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుని తీరుదామన్నారు. ముద్రగడ ఆదివారం కర్నూలులో కాపు సత్యగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగితే చంద్రబాబు రకరకాల బాధలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలిస్తే తెలుగుతమ్ముళ్లు కూడా చంద్రబాబును ఛీకొట్టడం ఖాయం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హంగు, ఆర్భాటాలకు హద్దూ, అదుపూ లేకుండా పోతోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల సొమ్మును సొంత ప్ర‌యోజ‌నాల‌కు  విచ్చ‌ల‌విడిగా వాడుకుంటున్నారు.. రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంద‌ని చంద్రబాబుకు తెలిసినా అవేమీ పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా ప్రత్యేక విమానాలు, కోట్లాదిరూపాయలతో ఇళ్లమరమ్మత్తులు చేయించుకున్న చంద్రబాబు తాజాగా మరో ఘటనతో తన జల్సా తనాన్ని బయట పెట్టుకున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం బెజవాడ ప్రజల ఎదురుచూపులు..ఎందుకో తెలిస్తే షాకే..!

ఏపీ చంద్రబాబు హిందూ దేవుళ్లను అవమానిస్తూ,  గుడులు కూలుస్తుంటే  తెలంగాణ సీఎం కేసీఆర్ గుడులు నిర్మిస్తూ.దేవుళ్లకు కోట్ల రూపాయలు పెట్టి నగలు చేయిస్తున్నారు..నిజంగా కేసీఆర్ గ్రేట్ అంటున్నారు బెజవాడవాసులు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్లో మార్పులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హ‌డావిడి జరుగుతున్న తరుణంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తేదీల‌ను మార్పు చేసింది. దీంతో పోలింగ్‌, ఓట్ల లెక్కింపు మ‌రింత ఆల‌స్యం కానుంది. మార్చి 17న జరగాల్సిన పోలింగ్‌, ఓట్ల లెక్కింపును మార్చి 20కి మారుస్తున్నట్టు ప్రకటించింది. తొలుత ఎమ్మెల్యేల కోటా, ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మార్చి 17న నిర్వహించాలని నోటిఫికేషన్‌ జారీచేసినప్పటికీ తాజాగా ఆ షెడ్యూల్‌ను మారుస్తున్నట్టు తెలిపింది. ఈ షెడ్యూల్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించనుంది.

పురందేశ్వరి చూపు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు..

దివంగత సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు చిన్న కూతురు, మాజీ కేంద్రమంత్రి  పురంధేశ్వ‌రి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితిలో ఉంది.. ప్రస్తుతం ఉన్న బీజేపీ హోదా ఇవ్వకపోవడంతో ఆపార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కే పరిస్థితిలేదు.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈమెకు రాజకీయ శత్రుత్వం ఉంది.. ఈ నేపధ్యంలో పురందేశ్వరి అంతర్మధనంలో పడినట్టు తెలుస్తోంది.

టీడీపీ పొలిట్ బ్యూరోకు హరికృష్ణను ఎందుకు ఆహ్వానించారో తెలిస్తే షాకవ్వాల్సిందే..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీసీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక నిర్ణయాన్ని పొలిట్ బ్యూరో చంద్రబాబుకు అప్పగించింది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేయాలని సూచించింది. ఎమ్మెల్యే కోటాలో లోకేష్ ను ఎమ్మెల్సీ గా ఎంపిక చేయాలని మొత్తానికి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమవేశంలో తెలంగాణ, ఏపీ అసెంబ్లీ లో అనుసరించాల్సిన తీరు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. అయితే చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పొలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు.

కొమ్మినేని చేసిన ఆ కార్యక్రమం జగన్ ని అగ్ని పునీతుడ్ని చేస్తోందా.?

కొమ్మినేని శ్రీనివాసరావు అలియాస్ కేఎస్సార్.. ఈయన తెలుగు మీడియాలో మోస్ట్ సీనియర జర్నలిస్ట్.. పత్రికల ద్వారా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించిన కొమ్మినేని టీవీ జర్నలిజంలోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. జర్నలిజం ప్రస్థానంలో అనేక ఆటుపోట్లకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అంచనా వేయడంలో కొమ్మినేని దిట్ట.. కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా ఫేమస్ అయిన కొమ్మినేని ప్రస్తుతం సాక్షి టీవీలో లైవ్ షో కొనసాగిస్తున్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తన లైవ్ షోల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే కారణంతో కొమ్మినేనిని ఎన్టీవీ నుంచి తప్పించారు.. ఈ విషయం అందరికీ తెలిసిందే..

సంబంధిత వార్తలు