Movies

ఆ పాత్రకు తగిన నటి నువ్వే..

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్న ‘భూమి’ చిత్రంలో నటి అదితిరావు హైదరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సంజయ్‌ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాళ్లు ఈ పాత్రకు తగిన నటి కోసం అన్వేషించిన చిత్ర బృందం అదితిని ఎంపిక చేసినట్లు బుధవారం తెలిపింది. ఒమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో తన పాత్ర కోసం అదితి సిద్ధమౌతున్నారట. ఫిబ్రవరిలో ‘భూమి’ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అదితి ఈ పాత్రకు సరిపోతుందని, తాము తీయబోయే ‘భూమి’ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆమె ఉన్నారని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

ప్రముఖ నిర్మాత షూటింగ్‌ సమయంలో పలుమార్లు నాపై అత్యాచారం జరిపాడు..న‌టి

బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన 'దిల్‌వాలే', 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'రా.వన్‌' సినిమాలకు నిర్మాత అయిన కరీమ్‌ మురానీనిపై హైదరాబాద్‌ పోలీసులు నిర్భయ కేసు నమోదుచేశారు. నిర్మాత కరీం.. ముంబై, హైదరాబాద్‌లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు హయత్‌నగర్‌ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదుచేశారు. సంచలనాత్మక 2జీ కుంభకుణంలోనూ కరీం మొరానీ నిందితుడిగా ఉన్నాడు. స్రెక్ట్రం స్కాం అనుబంధకేసుల్లో అరెస్టైన ఇతను, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.

శృంగారం చేయాల‌ని త‌హ త‌హ లాడిన బాలీవుడ్ నిర్మాత‌...

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ రాసిన ఆటో బయోగ్రఫీ బోలెడన్ని ఆసక్తికరమైన విశేషాలను బయటపెడుతోంది. మిగిలిన వారిపై కంటే.. తన గురించే తాను నిజాలు రాసుకున్న ఈ దర్శక నిర్మాత.. సెక్స్ విషయంలో తన అనుభవాలకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు.

ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్..

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 21వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ మాత్రం ఎన్టీఆర్ సమాధివద్దకు వచ్చి నివాళులర్పించలేదు.. కేవలం సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ పొగుడుతూ వ్యాసాలు రాసి ఆయనకు నివాళులర్పిస్తున్నట్టుగా ఫొటోలు దిగి అప్ లోడ్ చేశారు. ఈ వ్యవహారంపైనా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ లపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

శేఖర్ మాస్టర్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్...?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఎక్కడ డాన్స్ చూసిన శేఖర్ మాస్టర్ అనే పేరు మారు మోగుతుంది. ఈటివి డీ జోడి లో జడ్జ్ గా ఉంటూ మధ్య మధ్యలో తన స్టెప్పులతో అదరగొడుతూ.. ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో 2 సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా చేసాడు. అయితే శేఖర్ మాస్టర్ వర్క్ నచ్చిన చిరు ఐప్యాడ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఈ సందర్బంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఇది నా జీవితంలో బెస్ట్ మూమెంట్... అంటూ సంతోషించారు.

బాహుబలి2 రహస్యం బయట పెట్టిన పృథ్వీ

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళిని కలిసిన ఇండియన్ హీరోలు ప్రతి ఒక్కరు తమకు ఒక సీన్ లో నటించే ఛాన్స్ ఇవ్వమని అడిగిన వారే ఉన్నారట.. అయితే మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ బాహుబలి ది కంక్లూజన్ లో ఒక మంచి పాత్రను పోషించే అవకాశాన్ని జక్కన్న కల్పించారని చెప్పాడు. బాహుబలి గురించిన ఏ సీక్రెట్ బయటపెట్టకుండా ఈ టీమ్ వ్యవహరిస్తోంది. కానీ దీంట్లో తన పాత్రకు సంబందించిన ఒక సీక్రెట్ కూడా చెప్పేసాడు. నేను బాహుబలి2 లో అనుష్క నటించిన దేవసేన పాత్రకు మంత్రిగా కనిపిస్తానని చెప్పాడు పృథ్వీ. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలన్నింటిలో కామెడీ రోల్ చేసిన నేను ఈ చిత్రంలో మాత్రం సీరియస్ రోల్ చేస్తున్నాని తెలిపాడు.

బన్నీ సినిమా అయితే అన్నీ ఓకే: పూజా హెగ్డే

అందం అభినయంతో కంచెలు వేసుకున్నట్టుగా కనిపించే కంచె హీరోయిన్ పూజా హెగ్డే  తాజాగా 'డీజే' లో అల్లుఅర్జున్ సరసన నటించే అవకాశం కొట్టేసింది.అయితే గతంలో పూజ నటించిన చిత్రాలలో సంప్రదాయంగా కనిపించిన విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో 'మొహంజొదారో' సినిమా   తదనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న పూజ మాట్లాడుతూ...   గతంలో నేను సంప్రదంగా కనిపించినప్పటికీ ఇప్పుడు బన్నీతో నటిస్తోన్న సినిమాలో ఫుల్ గ్లామర్ గా కనిపిస్తానని చెప్తోంది. నా లేటెస్ట్ సినిమాలో అందం మొత్తం చూపిస్తాను...  టాలీవుడ్ లో బన్నీ తో నటించి ఈ సినిమా నా కెరీర్ ని మార్చేస్తుందని నేను నమ్ముతున్నాను అంటోంది ఈ బ్యూటీ.   
 

వేశ్య పాత్ర‌లో నటించనున్న కబాలి కూతురు

కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురు పాత్రలో నటించిన ధన్సిక ఒక వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకుందట.. అది కూడా కబాలి సినిమా నటించే సమయంలోనే తనకు ఈ ఆఫర్ వస్తే ఓకే చెప్పేసిందట! అయితే అది ఒక షార్ట్ ఫిలిం కోసం అని సమాచారం. ఈ సినిమాలో బెంగాలీ నటి బిట్టా బోగ్ కూడా యాక్ట్ చేయనుంది. ఆనంద్ మూర్తి డైరెక్షన్ లో రూపొందనున్న ఈ షార్ట్ ఫిలింకి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో సంగీతం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వేశ్యకు.. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ కు జరిగిన మధ్య జరిగిన సంఘర్షణ ఈ 'సినం' అంటున్నాడు దర్శకుడు. బిడితా అనే వేశ్య పాత్రలో ధన్సిక నటించనుందట.

ఎన్టీఆర్ పాత్రకు సీక్వెల్ గా అల్లుఅర్జున్

హరీష్ శంకర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా 'దువ్వాడ జగన్నాధమ్‌' చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా ఒక వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణుల యాసలో మాట్లాడుతూ కామెడీని పండించనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో చారి పాత్రకు సీక్వెల్గా ఈ మూవీ లో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని టాక్. అయితే అదుర్స్ సినిమాలో హరీష్ శంకర్... 'చారి' క్యారెక్టర్ ని సృష్టించి.. బ్రహ్మీ-ఎన్టీఆర్ ల మధ్య  కామెడీ పండించారు.

ఈ ఫోటో విపరీతంగా షేర్ అయిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదేనంటా...

ఆ మ‌ద్య బుల్లితెర భామలు త‌మ అందాలతో వేడెక్కించేస్తున్నారు .హిందీ టీవీ సిరీస్ లతో పాటు గతేడాది ప్యార్ కా పంచ్ నామా2 చిత్రంలో కనిపించిన కరిష్మా శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలోహాట్ హాట్ సెక్సీ అందాల‌ను చూపిస్తు తెగ రెచ్చిపోతోంది.

సంబంధిత వార్తలు