National & International

‘బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ

‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు.‘బిగ్ బాస్’ సీజన్ -1 ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’  ఫైనల్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతను ఈ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ‘బిగ్ బాస్’ ఫైనల్ లో శివబాలాజీ, ఆదర్శ్ నిలిచారు.  ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ట్రోఫీని, మనీ ప్రైజ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అందజేశాడు. ఈ సందర్భంగా శివబాలాజీని తోటి ఆర్టిస్టులు ప్రశంసించారు. కాగా, ఈ వేడుకకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లు హాజరయ్యారు.

సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సింగపూర్ తెలుగు సమాజం (ఎస్‌టీఎస్‌)తో కలిసి జరుపుకున్న బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్లో వైభవంగా జరిగాయి. సుమారు వెయ్యిమందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగపూర్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న టీసీఎస్‌ఎస్‌ను అభినందించారు. ఇలా సింగపూర్లో ఉన్న రెండు సంఘాలు స్నేహపూర్వక వాతావరణంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

30లోగా అన్ని బ్యాంకుల్లో ఆధార్‌ నమోదు కేం‍ద్రాలు

ఈనెల 30లోగా అన్ని బ్యాంకులు ఆధార్‌ నమోదు కేంద్రాలు, అప్‌డేట్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కోరింది. ప్రతి బ్యాంకు తమ పది బ్రాంచ్‌లకు ఒక ఆధార్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. డెడ్‌లైన్‌ ముంచుకొస్తుండటంతో బ్యాంకులు ఈ కేంద్రాల ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం చేశాయి. గడువులోగా ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయని బ్యాంకులకు ఒక్కో సెంటర్‌కు నెలకు రూ 20,000 చొప్పున పెనాల్టీ విధిస్తామని యూఐడీఏఐ బ్యాంకులకు స్పష్టం చేసింది.

సీఎం గా సోనియా గాంధీ ..?

ఆమె వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ .మహా మహా నేతలు ఆ పార్టీ తరపున ప్రధాన మంత్రులుగా చేశారు .డెబ్బై యేండ్ల స్వతంత్ర భారతంలో అత్యధికంగా పరిపాలించింది ఆ పార్టీనే .గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయిన పార్టీ .ఇంతకు ఆ పార్టీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.అదే కాంగ్రెస్ పార్టీ .ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ .

సామాన్యులకు మోదీ బంపర్ ఆఫర్ ..!

2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలలో ఒకటి "తమకు అధికారాన్ని కట్టబెడితే ఆరు నెలలో విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ను దేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఎకౌంటు లో పది హేను లక్షల రూపాయలు వేస్తాము .ఇలాంటి ప్రజాకర్షక హామీలను కురిపించి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు మూడు ఏండ్లు గడుస్తున్న కానీ పది హేను లక్షలు ఇవ్వడం పక్కన పెడితే విదేశాల్లో ఉన్న లక్షల కోట్ల బ్లాక్ మనీ ను తీసుకురాలేక పోయింది .

రైల్వేలో కొలువుల జాతర 2,25,823 పోస్టులు..

దేశంలోని అతిపెద్ద రంగమైన భారత రైల్వేశాఖలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్ధతతో ఉంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా...

కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం గుడ్ బై ...!

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె, ఆయన కుమారుడు, మాజీ ఎంపీ నీలేశ్‌ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు .

తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్టు తెలిపారు. అయితే రాష్ట్రంలో పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు పార్టీలో తనకు సరైన గౌరవం దక్కకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు .

బీజేపీ నేత ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి ...!

తమిళనాడు రాష్ట్రంలోని తిరువేర్కాడు సబర్బన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.రాష్ట్రంలోని బీజేపీ పార్టీకి చెందిన నేత పద్మనాభన్(48) ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి చేశారు. పద్మనాభన్ నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే దుండగులు చేసిన పెట్రోల్ బాంబు దాడికి ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి.అంతే కాకుండా ఇంట్లో ఉన్న సోఫా, కుర్చీలతో పాటు ఇతర వస్తువులు కాలిపోయాయి. బీజేపీ నేత పద్మనాభన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒకరుకాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఐదారుమంది విద్యార్థులతో రోజూ శృంగారం.. ఆ టీచరమ్మ

తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థులతో శృంగారం చేస్తూ టీచరమ్మ దొరికిపోయింది. అమాయక విద్యార్థులకు మాయమాటలు చెప్పి.. తన శారీరక వాంఛలను తీర్చుకునేందుకు వారిని ఉపయోగించుకుంది. ఇలా ఒకరుకాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఐదారుమంది విద్యార్థులతో రోజూ శృంగారం చేసేది ఆ టీచరమ్మ. ఆమె లీలలు తాజాగా బయటకు పొక్కడంతో.. పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో ఊచలు లెక్కపెట్టిస్తున్నారు..

హనీప్రీత్‌తో డేరా బాబా శృంగార లీలలన్నీ నాకు ముందే తెలుసు..హీరోయిన్

జైల్లో ఊచలు లెక్కపెడుతున్న డేరా బాబాకు వాతలు పెట్టే ఓ సిన్మా మొదలైంది. టైటిల్‌... ‘అబ్‌ ఇన్సాఫ్‌ హోగా’. బీటౌన్‌ ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ ఈ సిన్మాకు కర్త, కర్మ, క్రియ. ఇందులో ఆమె హనీప్రీత్‌ పాత్రలో నటిస్తుండగా, ఆమె తమ్ముడు రాకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ హనీప్రీత్, బాబాలపై ఓ ఐటమ్‌ సాంగ్‌ తీశారు. డేరాలో బాబా రంగులు, హనీప్రీత్‌తో అతడి శృంగార లీలలన్నీ నాకు ముందే తెలుసంటున్నారు రాఖీ. ఓసారి డేరాలోకి వెళ్లినప్పుడు వయాగ్రా పొట్లాలు చూశారట! అప్పుడే ఏదో ఒక రోజు వీడి చీకటి చరిత్రను ప్రజలకు తానే చెప్పాలని నిర్ణయించుకున్నారట. బాబా జైలుకి వెళ్లిన తర్వాత సినిమా స్టార్ట్‌ చేశానంటున్నారు.

సంబంధిత వార్తలు