Telangana

హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో విషాదం..

హైదరాబాద్‌ నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. సొహైల్‌ అనే వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తూ ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని వట్టేపల్లికి చెందిన అమిత్‌షాగా గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా మైలార్‌ దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సొహైల్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

నాగం.. ఆగ‌మాగం అయిన మార‌లేదు..

దేవుడు నోరిచ్చాడు క‌దా అని ఎలా ప‌డితే అలా వాగితే న‌డువ‌దురా నాగం. ప్ర‌జ‌ల పాలిట వ‌రంగా సాగుతున్న పాల‌న టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సొంతం. అది నీ ప‌చ్చ‌కామెర్ల క‌ళ్ల‌కు క‌న‌పించ‌క‌పోతే ఎవ‌రేం చేస్తారు తియ్. అన్న‌ట్టు ప్ర‌భుత్వ పాలన నీ పాలిట శాపంగా మారిందా ఆ మాట చెప్పు.. టీడీపీలో ఉన్న‌ప్పుడు ఆడింది ఆట పాడింది పాట‌గా ఉండే.. కండువ మార్చి క‌ప్ప‌లెక్క బీజీపీ లోకి దూకినంక నీ బ‌తుకు ఆగ‌మైంది. నీ చీటి చినిగిపోయింది..

కోదండం ..మీకో దండం

చెయ్య‌మ‌ని ప్ర‌భుత్వం గిట్ల నీకు చెప్పిందా. అయినా నువ్వు అస‌లు ఏ సైడ్ నాయ‌నా. ఓ సారేమో నిరుద్యోగ నిర‌స‌న ర్యాలీ చేసి తీరుతా అంటావు. అస‌లు ఎందుకు నిర‌స‌న ర్యాలీ చేస్తున్నావో చెపుతావ కోదండ‌రాం. ప్ర‌భుత్వం ఓ ప‌క్క స‌ర్కారీ కొలువుల జాత‌ర‌కు తెర లేపుతోంది. నోటీపికేష‌న్ల‌కు సిద్దంగా ఉన్న జాబ్ ల లెక్క 25 వేల‌కు పైనే మ‌రీ నీ ఇంకా నీ బాధ ఏందో అర్థం కావ‌డం లేదు.

నేతల‌కు, చేనేతలకు ప్రభుత్వమే పని కల్పించాలి....సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో చేనేత, నేత (మరమగ్గాల) కార్మికులకు ప్రభుత్వమే పని కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వారు తయారు చేసిన వస్త్రాలకు మార్కెటింగు కల్పించాలని, ప్రభుత్వం తరపునే ఆర్డర్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పాఠశాల విద్యార్థులకు ఏకరూపదుస్తులు, ఆసుపత్రులు, వసతిగృహాల్లో దుప్పట్లు, పండుగల సమయంలో పేదలకు పంచే దుస్తులు, పోలీసు యూనిఫారాల తయారీ చేనేతలకే ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఉన్న నిల్వలను కొనుగోలు చేయాలన్నారు. పవర్‌లూమ్‌ కార్మికులకు కావాల్సినంత పని ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన చేనేత, మరమగ్గాల రంగాలపై సమీక్ష నిర్వహించారు.

కోదండరామ్ కు తెలంగాణ పౌరుడి సూటి ప్రశ్నలు.

కోదండ రాం సార్ ... ఖర్చులెట్ల ఎల్తున్నాయ్?
జేఎసి కార్యక్రమాలకు డబ్బులు ఎవరిస్తున్నారు?
సభలు, పర్యటనలకు నిధులు ఎక్కడ నుండి వస్తున్నాయి?
జేఎసి కార్యాలయం ఎట్లా నడస్తున్నది?
పెన్షన్ డబ్బులతోనే కోదండరాం జేఎసి నడుపుతున్నడా?
జేఎసి ఖర్చుల వివరాలను ఐటి శాఖకు సమర్పిస్తున్నారా?
నీతి, నిజాయితీ జేఎసికి అక్కరలేదా?
కొదండరాం పారదర్శకత పాటించడా?

ఈ నెల 22న తిరుపతిలో తన పాత మిత్రుడ్ని కలవనున్న సీఎం కేసీఆర్

బుధవారం 22న తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన పాత మిత్రుడిని కలవబోతున్నారు అని సమాచారం . తన పర్యటనలో భాగంగా శ్రీవారి దర్శనానంతరం కుటుంబ సమేతంగా తిరుపతిలో తన స్నేహితుడి ఇంట్లో విందుకు హాజరుకానున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కొనసాగడంతో ఆ పార్టీలో ఆయనకు మంచి మిత్రులు ఉన్నారు.

తెలంగాణలో సర్కారు కొలువుల జాతర ...

ఎన్నో పోరాటాలు ..ఎంతోమంది తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్న సర్కారు.. ప్రభుత్వ సంస్థల్లోనే వేల పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటికే విద్యుత్ శాఖలో 2,695 మందికి కొలువులు లభించగా, మరో 23 వేల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధం చేసేందుకు సర్వం సిద్ధమైంది.

జర్నలిస్ట్ కూతురు పెళ్ళికి పెద్దన్నయ్య లా పెళ్ళికి 3లక్షలు ఆర్ధిక సహాయం చేసిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు పెద్దపల్లి లో జర్నలిస్టుగా పనిచేసి ఇటీవల మరణించిన మద్దిరాల నారాయణమూర్తి తెలియదు కానీ ఆయన కూతురు హిమబిందు పెళ్లి ఈ ఆదివారం జరుగుతోంది అని చెప్పడంతో చలించిన మంత్రి కేటీ రామారావు ఆ చెల్లికి పెద్దన్నగా మారి వెంటనే మూడు లక్షలు పెళ్లి ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు . మొన్న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో శుక్రవారం జరిగిన జనహిత కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివధ కారణాలచేత మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందించారు .

మంత్రి కేటీఆర్‌కు రెండోసారి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం..

ఆధునిక భారతావనికి ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు ప్రతినిధి అని అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అభివర్ణించింది. మంత్రి కేటీఆర్‌కు పంపిన ప్రత్యేక ఆహ్వానంలో స్టాన్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కొచ్చార్ ఈ విషయాన్ని తెలిపారు. వరుసగా రెండోసారి తమ యూనివర్సిటీ వార్షిక సదస్సులో కీలకోపన్యాసం చేయాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ పీఆర్వోగా జేఏసీ ఛైర్మన్ కోదండరాం..

తెలంగాణ రాష్ట్ర తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఈ రోజు నిప్పులు చెరిగారు.జాక్ చైర్మన్  కోదండరాం కాంగ్రెస్ పార్టీ పీఆర్వోగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తీరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌పై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు.

సంబంధిత వార్తలు