Home / MOVIES / ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది తెలిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు ఫిదా కావడం ఖాయం ..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది తెలిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు ఫిదా కావడం ఖాయం ..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ,నందమూరి అందగాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తన అన్న ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో లేటెస్ట్ గా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సినిమా “జైలవకుశ “.ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రేపు విడుదల కానున్న జై లవకుశ మూవీను తన అభిమానులు ..టాలీవుడ్ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఎలా రీసీవ్ చేసుకుంటారో అని తెగ హైరానా పడుతున్నారు .

ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు .తమ అభిమాన హీరో నటించిన జై లవకుశ మూవీ విడుదల కావడానికి ముందే ఒక పేద విద్యార్ధి చదువుకోవడానికి ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు .ఏపీలో తిరుపతి పట్టణానికి చెందిన పి మొహిత్ అనే విద్యార్ధికి తన తొమ్మిదివ తరగతి నుండి గత నాలుగు యేండ్ల నుండి నందమూరి ఫ్యాన్స్ డాట్ కామ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తోన్నారు .

ఈ తరుణంలో తాజాగా తుడా ఛైర్మన్ జి నరసింహ యాదవ్ చేతుల మీదుగా మొహిత్ కు పదిహేడు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు .ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ “గతంలో తమ అభిమాన హీరో మూవీ విడుదల అవుతుంటే ఫ్లెక్స్ లు ,బాణా సంచాలు కాల్చి సంబరాలు జరుపుకునేవాళ్ళం .కానీ గత నాలుగు ఏండ్లుగా తమ అభిమాన హీరో మూవీ విడుదల అయ్యే రోజు ఇలా పేదవారికి సహాయం అందిస్తూ పలు సేవ కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన అన్నారు .అయిన హీరో కోసం డబ్బులు ,రక్తాలు దారబోసే అభిమానుల కంటే ఇలా పేదవారి గురించి ఆలోచించే వారు గొప్పవారే కదా మరి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat