Home / TELANGANA / సున్హేరా హై తెలంగాణ, దేశ్‌కీ ధడ్‌కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!

సున్హేరా హై తెలంగాణ, దేశ్‌కీ ధడ్‌కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!

తాలీమ్ కే చిరాగ్ కో గలీ గలీ లేజాయేంగే- కేసీఆర్‌కే ఖ్వాబోంకో పూరా కర్ దిఖాయేంగే (విద్య అనే దీపాన్ని గల్లీ గల్లీలో తీసుకెళుదాం- కేసీఆర్ కన్న కలలను నిజం చేసి చూపిద్దాం),సున్హేరాహై తెలంగాణ- దేశ్‌కి ధడ్‌కన్ తెలంగాణ(బంగారు తెలంగాణ- దేశంలో ఖ్యాతి పొందిన తెలంగాణ), నఫ్రత్ సే హమ్ కామ్ న లే- ఐసీ ఫిజా బనాయేంగే- ఐసా చమన్ సజాయేంగే (విద్వేషాలతో పనిచేయవద్దు- సమాజంలో మంచి వాతావరణం నెలకొల్పుదాం- మంచి తోటలుగా తీర్చిదిద్దుదాం)… ఇది టెమ్రీస్ తరానా. అంటే తెలంగాణ రాష్ట్ర మైనార్టీల రెసిడెన్షియల్ స్కూళ్లు, విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్) తమ విద్యాసంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేకగీతం.

ప్రస్తుతం ఈ గీతం మైనార్టీ విద్యార్థ్ధులు, ప్రత్యేకించి మైనారిటీ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపి, వారిని విద్యారంగం పట్ల ఆకర్షించేందుకు ఎంతో దోహదపడుతున్నది. నిరక్షరాస్యత అధికంగా ఉండి, పేదరిక సమస్యతో సతమతమవుతున్న ముస్లిం సమాజంలో చదువుల వెలుగు నింపేందుకు ఈ తరానా ఒక దీపాన్ని వెలిగిస్తున్నది. రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకులాలు, మరో రెండు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో, టెమ్రీస్ కార్యక్రమాలు జరిగే చోట ఈ గీతం మైనార్టీ వర్గాలను ఎంతో ఆకర్షిస్తున్నది. మైనార్టీ గురుకులాలలో ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు నిర్వహించే అసెంబ్లీలో జాతీయ గీతం, జయజయహే తెలంగాణ గీతాల అనంతరం టెమ్రీస్ ప్రత్యేక గీతాన్ని విద్యార్థులతో గానం చేయిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో సుప్రసిద్ధ, చారిత్రాత్మక అలీగఢ్ ముస్లింయూనివర్సిటీకి ప్రత్యేక తరానా ఉంది. దాని తరహాలోనే మైనార్టీ గురుకులాలకు ప్రత్యేకంగా ఒక గీతం ఉంటే మైనార్టీ సమాజం నుంచి గురుకులాల లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుందనే ఆలోచన టెమ్రీస్ అధికారులకు తట్టింది. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలు, సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకులాల కోసం చేపట్టిన కార్యక్రమాలు, మైనార్టీ సమాజానికి నాణ్యమైన విద్యను అందించడం, వారి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని 3.45 నిమిషాల నిడివి గల ఒక ప్రత్యేక పాటను టెమ్రీస్ అధికారులు రూపొందించారు. సదాఖత్ హుస్సేన్ ఈ పాటను రాయగా, భోలేషావలి తన సంగీతంతో ఖలాసాలిబాతో కలిసి ఈ ప్రత్యేక గీతం పాడారు. ఇప్పుడు యూ ట్యూబ్‌లోనూ ఈ గీతం మారుమోగుతున్నది. ఎవరైతే మాకు మైనార్టీ గురుకులాలు ఇచ్చారో, హృదయంతో అతన్ని ప్రేమిస్తాం, మేమంతా విద్యాదాయకులుగా మారుతాం, నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. కలిసి ముందుకు పోతాం, విద్వేషాలతో కాకుండా ప్రేమానురాగాలతో పనులు చేస్తాం, ఒక మంచి వాతావరణాన్ని సమాజంలో సృష్టిస్తాం, టెమ్రీస్ విద్యార్థ్దులం మేము అనేది ముక్తసరిగా ఈ గీతం సారాశం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat