Home / MOVIES / బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్‌.. హరితేజ ఓడిపోవడానికి కారణాలు ఇవే..!

బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్‌.. హరితేజ ఓడిపోవడానికి కారణాలు ఇవే..!

తెలుగు స్మాల్ స్క్రీన్ పై న‌యా ట్రెండ్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్‌ విజయవంతంగా పూర్తయింది. మొద‌టిని నుండి ఆశ‌క్తిగా సాగిని బిగ్ బాస్ ప్రోగ్రాం ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మార్చడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. అందుకే వారు ప్రకటిస్తున్నట్లుగా ఫినాలే విన్నర్ ని నిర్ణయించడానికి పదకొండున్నర కోట్ల ఓట్ల దాకా పోలయ్యాయి. అయితే ఈ పది వారాల షోలో హౌజ్ మేట్స్‌కు వారం వారం గండం 70 రోజుల ఆయుష్షులా షో నడిచింది. మొత్తానికి 9 వారాల ఎలిమినేషన్స్‌ను తప్పించుకుని చివరాఖరుకు ఐదుగురు ఫినాలేలో పోటీ పడ్డారు. ఇందులో అర్చనను పోటీదారుగా ప్రేక్షకులు భావించలేదని ముందే తెలిసిపోయింది.అయితే ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అయిన.. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ ఎపిసోడ్స్ చూసిన ఆడియన్స్ చాలా మంది హరితేజ విన్నర్ కావాలని కోరుకున్నారు. హరితేజనే గెలుస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు. అయితే వారందరికీ షాక్ ఇస్తూ హరితేజకు మూడో స్థానం వచ్చిందని ఫినాలే లో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే హరితేజ గెల‌వ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుందామా..!

 

హరితేజ తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో నవరసాలూ పండించారు. అందరికంటే ఎక్కువ చెలాకీతనం ప్రదర్శించారు. ఓ ప్లేయర్‌గా ఎలా ఆడాలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మరీ వ్యవహరించారు. దీంతో షో ఐదు, ఆరు వారాల దాటిన తర్వాత అందరి నోటా హరితేజ.. హరితేజ.. అనే వినిపించింది. కాని చివరిలో కథ అడ్డం తిరిగింది. నువ్వు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నావ్.. ఇంకా టాలెంట్‌ను బయటికి తీయమని అమెకు అందిన ఇండికేషన్స్ తోనో ఏమో యాక్టింగ్ కాస్తా ఓవర్ యాక్టింగ్ అయిపోయింది. ఇక లేడీ కంటెస్టర్లను జంట్ కంటెస్టర్ల దగ్గర బ్లేమ్ చేసేది అనే అపవాదు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటిగా ఎలిమినేట్ అయిన జ్యోతి తన అన్ని ఇంటర్వ్యూల్లోనూ ఈ విషయన్ని చెబుతూ వచ్చింది. ఇక చివరిలో దీక్షను అయితే ఒంటరి చేసి కార్నర్ చేయడంలో అర్చనతో పాటు హరితేజ తెరవెనుక రోల్ ప్లే చేశారని.. దీక్ష బయటికొచ్చాక అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది. పోయి రావమ్మ అమ్మోరు తల్లో.. వంటి వర్డ్స్ ఇన్నోసెంట్‌గా ఉన్న దీక్ష విషయంలో చేయడం ప్రేక్షకుల్లో కొందరి మనసుల్లో హరితేజ స్థానం తగ్గిపోయింది.

మ‌రో వైపు శివబాలాజీ తన సహజమైన ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే హరితేజ లాస్ట్‌లో బరస్ట్ అయినట్లు కనిపించింది. ఎలిమినేట్ అయిన కంటెస్టర్లు దాదాపు అందరూ మీ ఫేవరెట్ ఫైనల్ విన్నర్ ఎవ‌రో చెప్ప‌మంటే.. శివ లేదా ఆదర్శ్ చెప్పారు. హరితేజ పేరు చెప్పిన వారు లేరు. ఇది కూడా ఎలిమినేట్ అయిన వారి క్యాంపెయిన్ హరితేజకు పరోక్షంగా నెగిటివ్‌గా సాగినట్లే లెక్క. ఇక అనేక సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేసిన శివ, ఆది లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంది. వాళ్లు ఫెయిర్‌గా ఆడినట్లు ప్రేక్షకులను మెప్పించగలిగారు. ఇక దీనికి తోడు శివబాలాజీకి అటు పవన్ ఫ్యాన్స్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగానే క్యాంపెయిన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. శివ భార్య మధుమిత సోషల్ మీడియాలో చాలా ఎఫెక్టివ్ గా తన భర్తకు మద్ధతు కూడగట్టారు. ఈ అడిషనల్ ఫ్యాక్టర్లు హరితేజకు లేకపోయే సరికి మంచి పెర్ఫార్మర్ గా గుర్తింపుతోనే ఆమె సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat