Home / MOVIES / సినిమాల్లోకి సచిన్ కూతురు…?

సినిమాల్లోకి సచిన్ కూతురు…?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాలీవుడ్ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. సచిన్ కుమార్తెను బాలీవుడ్ కు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిచయం చేయనున్నాడు. ఈమేరకు కథలు కూడా విన్నాడు. సారా టెండూల్కర్ ను రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ ల సరసన నటింపజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తన కుమార్తె చదువుకుంటోందని, ప్రస్తుతానికి ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తెకు కెరీర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చానని తెలిపాడు. ఆమెకు అవసరమైన సూచనలు మాత్రమే చేస్తానని అప్పట్లో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సారా సినీ రంగ ప్రవేశంపై వార్తలు వెలువడడంతో సచిన్ తన కుమార్తె బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో సంజయ్ దత్ కుమార్తె త్రిశాల సినీరంగ ప్రవేశంపై వార్తలు రాగా ఆయన సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. అలాంటి కోరిక కోరితే కాళ్లు విరగ్గొట్టి మూల కూర్చోబెడతానని సంజు బాబా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా కథనాలపై సచిన్ కుటుంబం ఇంకా స్పందించాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat