Home / ANDHRAPRADESH / ముస్సోరీ బాబు ప్రసంగంలో తప్పుల తడక ..!

ముస్సోరీ బాబు ప్రసంగంలో తప్పుల తడక ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ లో జరుగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సంగతి తెల్సిందే .ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తను ఎప్పుడు విద్యార్ధినే .

నేను నిరంతరం నేర్చుకుంటాను .తాను ఎప్పటికప్పుడు సమాజం ,అధికారుల నుండి నేర్చుకుంటాను అని ఆయన అన్నారు .దేశ నిర్మాణంలో అధికారులే భవిష్యత్తు నాయకులు అని అన్నారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “మానవ వనరులు ,ఆంగ్ల భాష మాట్లాడే జనాభా ,ఐటీ లాంటి మూడు రకాల సానుకూలతలు భారతదేశం సొంతం అని అన్నారు .ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతినలుగురు ఐటీ ఉద్యోగులలో ఒకరు ఇండియా నుండే ఉంటారు .

వీరిలో ఒకరు ఏపీ నుండే ఉంటారు అని అన్నారు .అయితే బాబు ప్రసంగం మీద సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోన్నారు నెటిజన్లు .నేను నిరంతర విద్యార్ధిని అని చెప్పుకునే బాబు గత మూడున్నర ఏండ్లుగా ఏమి నేర్చుకున్నారు .అవినీతి అక్రమాలు ఎలా చేయాలి ..చేసి చట్టానికి దొరక్కుండా ఎలా ఉండాలి అని నేర్చుకున్నారా అని నెటిజన్లు సెటైర్లు వేస్తోన్నారు .బాబు అన్నట్లు ప్రతినలుగురిలో ఒకరు ఏపీ నుండి ఉంటె ఏపీలో నిరుద్యోగ సమస్య ఎక్కడ లేని విధంగా ఎక్కువగా ఎందుకు ఉంది .బాబు ముస్సోరీ ప్రసంగంలో అన్ని తప్పుల తడకే అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు .