Home / ANDHRAPRADESH / జగన్ పై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు -అందుకేనా ..?

జగన్ పై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు -అందుకేనా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు .రేపు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు టీవీ ఛానల్స్ కు పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు .

ఈ క్రమంలో జగన్ తండ్రి ,ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్న క్రమంలో సూపర్ స్టార్ ప్రశంసల వర్షం కురిపించారు .దీనిలో భాగంగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “గతంలో ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను కలిశాను అని చెప్పారు .ఆయన మంచి మనిషి .

నేను వెళ్ళిన సమయంలో బాగా రీసీవ్ చేసుకున్నారు అని ఆయన అన్నారు .నేను వైఎస్సార్ ను కల్సిన సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారు అని అన్నారు .వైఎస్ అద్భుతమైన నాయకుడు .నిత్యం ప్రజల గురించి ఆలోచించేవాడు అని అన్నారు .ప్రస్తుతం ఆయన బాటలోనే జగన్ నడుస్తున్నారు .తన తండ్రి కృష్ణ జగన్ కు బాగా క్లోజ్ .మా నాన్నగారికి జగన్ అంటే చాలా అభిమానం అని ..వైఎస్ మాదిరిగా నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజలకు జగన్ ఉన్నాడు అని గుర్తు పెట్టుకోవాలని అని ఆ ఇంటర్వ్యూ లో అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat